- ( గ్రేటర్ హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .
తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పైనే ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే అదే గ్రేటర్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ నుంచి బిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ వెంటనే జరిగిన ఉప ఎన్నికలలో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ ఇదే గ్రేటర్ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపయోగించి జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉపఎన్నికకు ఎప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానం .. ఇక్కడ నుంచి గెలవడం ఆ పార్టీకి కీలకం. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని సైతం ఆ పార్టీ కాంగ్రెస్కు కోల్పోతే కేటీఆర్ రాజకీయానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టు అవుతుంది.
అసలు వాస్తవంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలం ఎంత అని ప్రశ్నించుకుంటే ? ఇక్కడ బీఆర్ఎస్ వాపును చూసి బలుపు అనుకుంటుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 2014లో ఇక్కడ బీఆర్ఎస్ ఏకంగా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. టిడిపి నుంచి పోటీ చేసిన గోపీనాథ్ విజయం సాధించగా.. మజిలీస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మజ్లిస్ తో బీఆర్ఎస్ కు ఉన్న అవగాహన నేపథ్యంలోనే 2018లో గోపీనాథ్ వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చివరి క్షణంలో అజారుద్దీన్ ను రంగంలోకి దించింది. ఆయన ప్రచారం సరిగా చేయలేకపోయారు. మజ్లిస్ ఓటర్లు, ముస్లిం ఓటర్లు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అందుకే అజార్ 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి మజ్లిస్ కాంగ్రెస్ క్యాండెట్‌కు సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్‌కు దబిడి దిబిడే అవుతుంది.. గెలుపు అంత వీజీ కాదు.