
గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఎక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తో పాటు బిజెపి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. జూబ్లీహిల్స్ పేరుకు మాత్రమే ధనికులు , సెలబ్రిటీలు ఉండే నియోజకవర్గంగా ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో ఎర్రగడ్డ - బోరబండ - యూసఫ్ గూడ లాంటి బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. బస్తీ ప్రజలు , నిరుపేద , మధ్యతరగతి వర్గాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నియోజకవర్గంలో మూడో లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచినా ప్రధానంగా మూడు వర్గాలు అభ్యర్థి గెలుపును నిర్ణయించనున్నాయి.
బస్తీలలో ఉండే ఓటర్లతో పాటు నియోజకవర్గంలో దాదాపు 40 వేలకు పైగా ఉన్న ముస్లిం ఓటర్లు కూడా అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నారు. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ప్రధానంగా ఆంధ్ర సెటిలర్స్ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. ఆంధ్ర నుంచి వచ్చి గ్రేటర్ హైదరాబాద్లో సెటిల్ అయినా పారిశ్రామిక , ఇతర వ్యాపార రంగాలలో స్థిరపడిన సెటిలర్ ఓటర్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఉప ఎన్నికలలో బస్తీ ఓటర్ లతో పాటు ముస్లిం ఓటర్లు , ఇటు సెటిలర్ ఓటర్ లు ఎక్కడ అభ్యర్థుల గెలుపు ఓటమి ప్రభావితం చేస్తారు అనటంలో సందేహం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు