కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో లబ్ధిదారుల నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమ వైద్యం అందడం లేదని, రోడ్లకు కనీస మరమ్మత్తులు కూడా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షం పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ నాయకత్వం నిద్రాణంగా ఉందని ధ్వజమెత్తారు.తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత నెలకొన్నట్లు కవిత స్పష్టం చేశారు. వెంటనే స్పందించే నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రతి జిల్లాలోనూ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తోందని వివరించారు. అయితే సమయం, సందర్భం, అంశాలు సరిపోలినప్పుడే కొత్త పార్టీ ఆరు అవసరమని జాగ్రత్తగా వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకోవడం తన ఉద్దేశ్యం కాదని కవిత పునరుద్ఘాటించారు.
వనపర్తిలో పర్యటన సమయంలో ప్రజలు వెలిసిన ఆవేదనే తనను ఈ విధంగా మాట్లాడేలా చేసిందని స్పష్టీకరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడం కోసం ఆమె త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి