కాళేశ్వరం డ్యామ్ ను ఇటీవల పరిశీలించిన బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక తవ్వకాల కోసం కాంగ్రెస్ నాయకులు ఈ చెక్ డ్యామ్‌ను జిలిటిన్ స్టిక్స్‌తో పేల్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాస్ట్ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఆ వీడియో రికార్డింగ్‌లో జిలిటిన్ స్టిక్స్ అమర్చిన దృశ్యాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ వీడియోను త్వరలో బహిర్గతం చేస్తామని హరీశ్ రావు ప్రకటించారు.

ఇదే విధమైన బ్లాస్ట్ మేడిగడ్డ బ్యారేజీలో కూడా జరిగిందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరామారావును సవాలు విసిరారు. చెక్ డ్యామ్‌ను బ్లాస్ట్ చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి చపుడతానని విజయరామారావు అన్నారని, ఆ సవాలు స్వీకరిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కౌశిక్ డిమాండ్ చేశారు.

తాను బ్లాస్ట్ జరిగిన ఆధారాలు చూపిస్తానని, దమ్ముంటే విజయరామారావు కూడా రాజీనామా చేయాలని ప్రశ్నించారు. ఈ ఘటనలో అధికార కాంగ్రెస్ నాయకుల పేర్లు ఫిర్యాదుల్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు.నీటిపారుదల శాఖ ఈ ఈ ఫిర్యాదు చేసింది. అంతకుముందు వందల మంది రైతులు జిలిటిన్ స్టిక్స్ పట్టుకొని ఫోటోలతో సహా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.

చెక్ డ్యామ్ నిర్మించిన కాంట్రాక్టర్ సంస్థను వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాయకులు చేశారని ఆరీశ్ రావు ఆరోపించారు.మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడం కాదు, కాంగ్రెస్ గుండాలే ప్లాన్‌తో పేల్చేశారని హరీశ్ రావు సంచలన ఆరోపణ చేశారు. ఈ రెండు ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చెక్ డ్యామ్ మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలని హెచ్చరించారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: