రేవంత్ రెడ్డి సర్కారు ఇటీవల ఇందిరమ్మ చీరలు పంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చీరల అంశం కూడా వివాదాస్పదం అవుతోంది. పంచుతున్న చీరలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి  సీతక్క ఘాటుగా బదులిచ్చారు. చీరల రంగు డిజైన్ బాగోలేదని దుష్ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు. ఈ చీరలను మహిళా సంఘాలే ఎంపిక చేసిన డిజైన్లలో సిరిసిల్ల నేతన్నలు స్వయంగా నేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.

కేటీఆర్ హరీష్ రావు కవిత కావాలంటే సిరిసిల్ల వెళ్లి నేతన్నలను అడిగి నిజం తెలుసుకోవచ్చని ఆమె సవాల్ విసిరారు.బీఆర్ఎస్ హయాంలో సూరత్ నుంచి కిలోల లెక్కన తెచ్చిన నాసిరకం చీరలు కాదివని సీతక్క గుర్తు చేశారు. ఇప్పుడు స్వదేశీ నేతన్నల చేతుల్లో నేసిన నాణ్యమైన చీరలు పంచుతున్నామని ఆమె గర్వంగా చెప్పారు. ఆడబిడ్డలు చీరలు అందుకుని సంతోషిస్తుంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలను ఆమె ఎద్దేవా చేశారు.

ఆడవాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆమె ఆరోపించారు.కొందరికే చీరలు ఇస్తున్నారన్న ఆరోపణలను సీతక్క తోసిపుచ్చారు. మహిళా సంఘాల్లో లేని లబ్ధిదారులన్నీ సంఘంలోకి ఆహ్వానించి చీరలు ఇస్తున్నామని ఆమె వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద మహిళలు లబ్ధి పొందుతున్నారని ఆమె గుర్తు చేశారు. సిరిసిల్ల నేతన్నలను అవమానించేలా మాట్లాడటం బీఆర్ఎస్ నేతలకు తగదని ఆమె హెచ్చరించారు.

చీరల పంపిణీ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ నేతలు నాణ్యత రంగు డిజైన్‌లపై విమర్శలు గుప్పిస్తుంటే కాంగ్రెస్ నాయకులు దాన్ని రాజకీయ కుట్రగా చిత్రిస్తున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: