అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సవాల్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివాదాన్ని అత్యంత వ్యూహాత్మకంగా డీల్ చేస్తున్నారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన రేవంత్, కేసీఆర్‌కు నేరుగా సవాల్ విసిరారు. తప్పెవరిదో.. ఒప్పెవరిదో అసెంబ్లీకి వచ్చి తేల్చుకుందాం అని రేవంత్ అనడం ద్వారా బంతిని కేసీఆర్ కోర్టులోకి నెట్టారు. కేసీఆర్ చేసిన ఆరోపణలను సాక్ష్యాధారాలతో తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సభలో కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి వన్ సైడ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.
అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్‌కు నష్టమేనా.. ?
కేసీఆర్ తన ప్రెస్‌మీట్‌లో 15 రోజుల్లో మూడు బహిరంగ సభలు పెడతానని ప్రకటించారు కానీ, అసెంబ్లీ హాజరుపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఆయన సభకు రాకుండా కేవలం బయట సభలకే పరిమితమైతే అది బీఆర్ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. చట్టసభలో నిలబడి నిలదీయకుండా, కేవలం మైకుల ముందు మాట్లాడితే ప్రజలు దానిని సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి సభకు రాకుండా తప్పించుకుంటున్నారనే ముద్ర పడే ప్రమాదం ఉంది.
రేవంత్ అడ్వాంటేజ్:
కేటీఆర్, హరీశ్ రావు సభలో ఉన్నప్పటికీ, కేసీఆర్ స్థాయిలో వారు ప్రభుత్వాన్ని డిఫెన్స్ చేయలేకపోవచ్చు. కేసీఆర్ లేని సభలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ ప్రసంగాలతో ప్రజల దృష్టిని ఆకర్షించగలరు. కేసీఆర్ బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. కానీ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బయట సభలు పెట్టి అక్కడ కౌంటర్ ఇవ్వడం చట్టసభలను అవమానించడమే అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంధించే ప్రశ్నలకు, గణాంకాలకు బయట ఇచ్చే సమాధానాలు ప్రజల్లో ఎంతవరకు చెల్లుబాటు అవుతాయన్నది సందేహమే.
ఏదేమైనా నీళ్ల అంశాన్ని ఆయుధంగా చేసుకుని మళ్ళీ 'తెలంగాణ సెంటిమెంట్'ను రగిలించాలని కేసీఆర్ భావిస్తుంటే, గత పదేళ్ల వైఫల్యాలను ఎండగట్టి కేసీఆర్‌ను ఇరుకున పెట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ పొలిటికల్ గేమ్‌లో గెలుపెవరిదో తేలాలంటే జనవరి 2 వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి