BSNL.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. మంచి ప్రభుత్వ రంగ కంపెనీ.. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం అంటే బంపర్ ఛాన్సే అనుకోవాలి. మరి అలాంటి సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు ఇవాళే ఆఖరు తేదీ.. మరి అప్లయ్ చేశారా మీరు..

 

 

BSNL తెలంగాణ సర్కిల్ లో మొత్తం 100 ఖాళీలకు అప్లయ్ చేసేందుకు నేడు చివరి తేదీ. ఇంతకీ ఉద్యోగాలు ఏంటంటారా.. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 75, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు 25 ఉన్నాయి.

 

 

అర్హతల విషయానికి వస్తే.. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ పాస్ కావాలి. అదే.. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకైతే.. ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ డిప్లొమా ఉండాలి. అప్లై చేయాలనుకున్న వారు http://www.mhrdnats.gov.in/ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

 

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: