క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు ఎక్క‌డ ఎలా ప‌ట్టేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు తీవ్ర భ‌యందోళ‌న‌కు గ‌ర‌వుతున్నారు. క‌రోనా వైర‌స్ పేరు చెప్పినా ఆమ‌డ దూరం పారిపోయే ప‌రిస్థిలో ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 28లక్షలు దాటింది. మరణాలు 2లక్షల చేరువలో ఉన్నాయి. ఇక అమెరికాలో అయితే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రష్యా, బ్రిటన్‌లో క‌రోనా వైరస్ విల‌య‌తాండ‌వం చేస్తోంది.  ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. 

 

అయితే ఇప్ప‌టికే క‌రోనాను నియంత్రించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో అన్ని సంస్థ‌లు బంద్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే భారీ న‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నారు. ఇక క‌రోనా వైర‌స్ ఎప్పుడు అదుపులోకి వ‌స్తుందో తెలియ‌క‌.. అప్పుల భారం త‌ట్టుకోలేని కొన్ని సంస్థ‌లు పూర్తిగా మూత ప‌డుతున్నాయి. దీంతో ఉద్యోగులు కాస్త నిరుద్యోగులుగా మారుతున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణలోని బీబీనగర్‌లో గల ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది.

 

తెలంగాణలోని ఎయిమ్స్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పుదుచ్చెరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 53 ఖాళీలను ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రకటించింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇక మొత్తం 53 ఖాళీలు ఉండ‌గా.. అందులో ప్రొఫెసర్- 06, అడిషనల్ ప్రొఫెసర్- 13, అసోసియేట్ ప్రొఫెసర్- 11, అసిస్టెంట్ ప్రొఫెసర్- 23 పోస్టులు ఉన్నాయి.

 

విద్యార్హత విష‌యానికి వ‌స్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 27 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్రమే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి ఆస‌క్తిగ‌త అభ్య‌ర్థ‌లు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేయండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jipmer.edu.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: