బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా అదే స్థాయిలో పేరు సంపాదించింది. ప్రస్తుతం టాలీవుడ్లో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. దీంతో అప్పటినుంచి మళ్ళీ తిరిగి ఈమె పేరు ఎక్కువగా ఈ మధ్యకాలంలో వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటూ అంతర్జాతీయ వేదికపై కూడా మంచి గౌరవం దక్కించుకుంది.


ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖులను సత్కరించే ప్రముఖ సంస్థ గోల్డ్ హౌస్ ఈ ఏడాది తమ గోల్డ్ గాలా లో ప్రియాంక చోప్రాను ప్రత్యేకించి మరి గౌరవించినట్లు తెలుస్తోంది. వివిధ రంగాలలో రాణిస్తున్న అత్యుత్తమ ఆసియా ప్రముఖులను గోల్డ్ హౌస్ ప్రతి ఏడాది కూడా 100 జాబితాను విడుదల చేస్తుంది. అలా ఈ ఏడాది ప్రియాంక చోప్రా గ్లోబల్ వాన్ గార్డ్ ఆనర్ తో సత్కరించినట్లు అధికారికంగా ప్రకటించారు. వినోద రంగానికి గాను ఆమె సాధించిన ఎన్నో విజయాలను ప్రపంచవ్యాప్తంగా  ఆసియా సంస్కృతిని ప్రతిబింబించడంలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉందంటూ అవార్డుని అందజేశారు.


ఐదవ ఎడిషన్ గా జరుగుతున్న ఈ గోల్డెన్ గాలా  మే 9వ తేదీన 2026 లాస్ ఏంజిల్స్ లో అత్యంత వైభవంగా జరగనుంది. ఇక ఈ విషయం తెలిసిన ప్రియాంక చోప్రా అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగంలో దాదాపుగా ప్రియాంక చోప్రా 25 ఏళ్ల పాటు కొనసాగుతోంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు విజయవంతంగా కొనసాగింది. అటు ఆసియా పసిఫిక్ మరియు వెస్ట్రన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీల మధ్య ఈమె నిలిచిన పాత్ర వారధిగా మారిందని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రోత్సహించడం వంటి కారణాలవల్ల గోల్డ్ హౌస్ సంస్థ ఈమెకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇస్తోంది. ఈ గోల్డ్ గాలా కార్యక్రమంలో ప్రియాంక చోప్రా తో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా అవార్డు అందుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: