టాలీవుడ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన తాజా హారర్ కామెడీ ఎంటర్మెంట్ చిత్రం రాకాస. ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీన థియేటర్లో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా నిహారిక కొనిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పైన నిర్మించారు. ఈ సినిమాని మానస శర్మ దర్శకత్వం వహించగా, ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు సైతం డైరెక్టర్ పైన ప్రశంసలు కురిపించారు.



ఇప్పుడు తాజాగా ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కి సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటి ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మే ఒకటవ తేదీన నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రాకాస సినిమా తమిళ్, తెలుగు ,మలయాళం, హిందీ భాషలలో కూడా ఓటీటి లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను కామెడీ సీన్స్ హైలెట్గా ఉంటాయి. వీరి ముగ్గురి డైలాగ్ టైమింగ్ కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వులు పూయించేలా చేస్తాయి.



ఈ చిత్రంలో సంగీత్ శోభన్ నాచురల్ యాక్టింగ్ తో మరొకసారి అందరిని ఆకట్టుకున్నారు. థియేటర్లో మిస్ అయినవారు ఓటీటి లో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయవచ్చు. హర్రర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ కామెడీ హర్రర్ సినిమాని మంచి ఎంటర్టైన్మెంట్ కానుంది. సంగీత్ శోభన్ కెరియర్ విషయానికి వస్తే.. 2010లో తకిట తకిట అనే చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా పరిచయమయ్యారు ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్ లో కూడా నటించారు. మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగీత్ శోభ ఆ తర్వాత మాడ్ స్క్వేర్, గ్యాంబులర్స్ రాకాస వంటి చిత్రాలతో బాగా ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: