కరోనా మహమ్మారి భారత్ లో తగ్గుముఖం పట్టడంతో నిభంధనలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ భారత్ ప్రజలు పాటించిన సామజిక దూరానికి ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటి వరకూ నోటిఫికేషన్లని పరీక్షలని, ఇంటర్వ్యూ లు ఇలా ప్రతీ ఒక్క అంశాన్ని పెండింగ్ లో పెట్టిన సంస్థలు మళ్ళీ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి..ఈ క్రమంలోనే సెంట్రల్ రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మెడికల్ పారా మెడికల్ స్పెషలిస్ట్ పోస్తులని భర్తీ చేయనుంది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

భారత రైల్వే ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన నోటిఫికేషన్స్ లో ఎక్కువగా మెడికల్ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సెంట్రల్ రైల్వే  కూడా సెంట్రల్ రైల్వే పారామెడికల్ , మెడికల్, స్పెషలిస్టు పోస్టులని  భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ , స్పెషలిస్ట్ పోస్తులని భర్తీ చేయనుంది. నాగపూర్ లోని డివిజన్ రైల్వే ఆసుపత్రిలో రోగులకి సేవలు అందించేందుకు గాను ఈ పోస్తులని భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులు మూడు నెలల పాటు తాత్కాలిక పోస్టులు మాత్రమేనని ప్రకటించింది. ఇందులో మొత్తం 38  ఖాళీలు ఉన్నాయి.

 

నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే

 

మొత్తం పోస్టుల సంఖ్య :  38

కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ : 26

ఫిజిషియన్ స్పెషలిస్ట్ : 4

అనస్తిశియా స్పెషలిస్ట్  : 4

ఇంటెన్స్ విస్ట్ : 4

ధరఖస్తులకి చివరి తేదీ : 20-05-2020

ఇంటర్వ్యూ విధానం : ఆన్లైన్  ( సైప్ లో కానీ లేదా వాట్సప్ వీడియో కాల్స్ లో కానీ ఇంటర్వ్యూ నిర్వహణ జరుగుతుంది )

మరిన్ని వివరాల కోసం 

https://cr.indianrailways.gov.in/cris//uploads/files/1589093169443-extensionCutOff.jpeg

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: