కరోనా వైరస్ కారణంగా బంగారం ధర రోజు రోజుకు ఎలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ బంగారం ధర గత వారం రోజుల్లో భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణం అనే చెప్పాలి. ఇక వెండి ధర కూడా భారీగానే తగ్గింది. 

 

దీంతో బంగారం ధర గత వారం రోజుల్లో హైదరాబాద్ మార్కెట్‌లో ఇలా కొనసాగుతుంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1810 రూపాయిలు తగ్గుదలతో రూ.41,770 నుండి రూ.39,960కు క్షిణించింది. ఇంకా ఇదే తరహాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1320 రూపాయిల తగ్గుదలతో రూ.45,300 నుండి రూ.43,980కు చేరింది. 

 

ఇంకా పసిడి ధర భారీగా తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచి భారీగా పతనం అయ్యింది. అప్పటికే కేజీ వెండి ధరకు 10 వేలు తగ్గినా ధర గత వారం రోజుల్లో మరో 1150 క్షిణించింది. దీంతో కేజీ వెండి ధర రూ.40,270కు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎవరు బయటకు రాలేని పరిస్థితి.. బంగారంను ఎవరు కొనలేని పరిస్థితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: