ప్రస్తుతం ఆదిత్య ధర్ దృష్టి పూర్తిగా ‘ధురంధర్ 2’ పై ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాతే అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నెట్టింట టాక్ వినిపిస్తోంది. అందుకే అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కార్యరూపం దాల్చితే, బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసే సత్తా ఈ ప్రాజెక్ట్‌కు ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇదిలా ఉండగా, మరోవైపు అల్లు అర్జున్ – సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌పై కూడా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘అనిమల్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా తెరకెక్కితే, అది కూడా పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ పండితులు భావిస్తున్నారు.
ఈ రెండు భారీ కాంబినేషన్లలో ఏది ముందుగా కన్ఫర్మ్ అవుతుందన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవైపు ఆదిత్య ధర్ కథతో అల్లు అర్జున్ కనిపిస్తే, మరోవైపు సందీప్ రెడ్డి వంగా స్టైల్‌లో ఐకాన్ స్టార్ ఎలా ఉండబోతున్నాడో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా, అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రభావం చూపడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి