
1).జుట్టుకు అయిల్
ఈ సీజన్ లో మాడుపై చర్మం పొడిమారి దురద వస్తుంది. దీనివల్ల తలపై చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి ఈ అయిల్ బాగా ఉపయోగపడుతుంది.రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్, ఒక స్ఫూన్ కొబ్బరి నూనెను తీసుకొని వేడి చేసి, గోరు వెచ్చగా వున్నప్పుడు ఒక టీస్పూన్ నిమ్మరసంతో కలపాలి.ఈ మిశ్రమాన్ని బాగా మర్దన చేసి అరగంట సేపు ఆగి,తరువాత మైల్డ్ షాంపూ లేదా కండీషనర్‌తో స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
2).జుట్టు షైనింగ్ కోసం..
వాతావరణం మార్పు వల్ల జుట్టు మెరుపుదనాన్ని కోల్పోతుంది. మీ జుట్టు మెరుస్తూ మరియు సిల్కీగా ఉండటానికి, తేనెను, గుడ్డు మిశ్రమాన్ని తీసుకోని జుట్టు మొత్తానికి రాసిన తరువాత మీ తలను షవర్ క్యాప్ తో కప్పి 30 నిమిషాలు ఉంచాలి.అరగంట తరువాత షాంపూ మరియు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. తేనె రాయడం వల్ల జుట్టుకి మెరుపు సంతరించుకుంటుంది.
3).జుట్టును ఆరబెట్టడం..
చలి కాలంలో తలస్నానం చేసిన తర్వాత అరబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది.అలాంటప్పుడు జుట్టును అరబెట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వుతారు. మరికొందరు దానిని టవల్ తో రుద్దుతారు.కొంతమంది హెయిర్ డ్రైయర్ వాడుతారు.ఇలాంటి చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపొతాయి. జుట్టును సహజంగా ఆరానివడమే చాలా మంచిది.
4).కండిషనర్ వాడటం..
స్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడటం వల్ల జుట్టు పొడిబారకుండా, అందంగా, మెరుగ్గా తయారవుతుంది.