ఈ మధ్యకాలంలో డయాబెటిస్ తర్వాత, అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన వ్యాధిగా, క్యాన్సర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచంలో ప్రతి పదిమందిలో ఒకరు రకరకాల క్యాన్సర్ ల బారినపడుతున్నారు.దీనికి కారణాలుగా మనం తినే ఆహారం, చెడు అలవాట్లు, వాతావరణ కాలుష్యం మొదలగునవి చెప్పుకోవచ్చు. ముందు నుంచే క్యాన్సర్ మన శరీరానికి తాకకుండా కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల, క్యాన్సర్ కారకమయ్యే ప్రీరాడికల్స్ తో పోరాడి అంతం చేసే లక్షణాలను పెంచుకోవచ్చు.అలాంటి ఆహారాల్లో ముఖ్యంగా ముల్లంగి ఒకటి. క్యాన్సర్ నిరోధకారిణిగా ముల్లంగి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం..

ముల్లంగిలోని పోషకాలు..
ముల్లంగిలో తక్కువ కార్బోహైడ్రైట్స్ మరియు ఎక్కువ నీటి శాతం ఉంటుంది. తక్కువ ప్రోటీన్,క్యాలరీలను పొందవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.అంతేకాక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు అధికంగా ఉంటాయి.

క్యాన్సర్ నివారిణిగా..
ముల్లంగిని తరుచూ తీసుకోవడం వల్ల ముల్లంగిలోని అలీల్ ఐసో తీయోసినెట్ అనే సమ్మేళనం క్యాన్సర్ కారకాలను డైరెక్ట్ గా దాడి చేసి మరీ నశింపచేస్తుందని,శాస్త్రవేత్తలు పరిశోదనలు చేసి మరీ నిరూపించారు.ముళ్లంగి క్యాన్సర్ నివారిణిగా మాత్రమే కాక ఇతర ఆరోగ్య ప్రయోజలను చేకూరుస్తుంది.

ముల్లంగిని తరుచూ తీసుకోవడం వల్ల, ఆసిడిటిని తగ్గించుకోవచ్చు.ఇది పేగులో జిగురు ఉత్పత్తిని పెంచి అసిడిటీని తగ్గిస్తుంది.ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాల ఉండటం వల్ల మధుమేహరోగులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో నీటిశాతం అధికంగా ఉండడం వల్ల, తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమై కిడ్నీలు తక్కువ సమయంలో ఎక్కువ టాక్సిన్స్ వడకట్టేలా చేసి,వాటిపై పనిభారన్ని తగ్గిస్తుంది.దీనిలోని ఇండోల్ కర్బీనల్,ఐసోథియోసినేట్ వంటి గుణాలు అధికంగా ఉండడం వల్ల లివర్ డ్యామేజీ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.ఇందులో ఉండే పైరోగలాల్  అనే కెమికల్ కాంపోనెంట్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడి, వైరస్,బ్యాక్టీరియల్,ఫంగస్ల వల్ల కలిగే రోగాలు రాకుండా కాపాడుతుంది. కావున ప్రతి ఒక్కరూ ముల్లంగిని తరచూ తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: