
ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ , పీచు పదార్థాలు ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మన పొట్ట పేగుల్లో విష పదార్థాలను తొలగించడంలో బొప్పాయి చాలా చక్కగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, కాపర్ , మినరల్స్ , ఫైబర్ , మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మనకు అన్ని రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇకపోతే బొప్పాయి పండు మాత్రమే కాదు బొప్పాయి గింజల్లో కూడా మనకు బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి . గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు.
బొప్పాయి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి..జీర్ణ క్రియను మెరుగుపరిచి శరీర వ్యక్తాలను తొలగించి వేస్తుంది . శరీరంలో అనవసర కొవ్వు నిలువలు లేకుండా చూస్తుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు. బొప్పాయిలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. రుతుక్రమం సరైన క్రమంలో ఉండేలా చేయడంతో పాటు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా బొప్పాయి గింజలు తగ్గిస్తాయి. బొప్పాయి గింజలు విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, పాలి ఫినాల్స్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉండడం వల్ల కడుపులోని మంట, నొప్పిని కూడా తగ్గించి వేస్తాయి. వీటితోపాటు క్యాన్సర్ , ఫుడ్ పాయిజన్ వంటి సమస్యల నుంచి కూడా మన శరీర ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు.