ప్రస్తుతం చిన్న వయసులో కూడా గుండెపోటు వచ్చి అనేకమంది మరణానికి  కారణమవుతోంది. జిమ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, ఆఖరికీ నడుస్తూ కూడా గుండెపోటుతో కూలిపోయి చాలా మంది మరణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.పునీత్ రాజ్ కుమార్, తారకరత్న, ఇంకా కొన్ని రోజుల క్రితం బీహార్‌లో ఉపన్యాసం ఇస్తున్న ఓ వ్యక్తి సడెన్ గా గుండెపోటుతో మరణించాడు. ఇలా గుండెపోటు బారిన పడి అక్కడికక్కడే మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సరిలేని జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇంకా అలాగే కరోనా వైరస్‌ కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ గుండె జబ్బులను కూడా ఈజీగా నియంత్రించవచ్చు. కానీ అంతకంటే ముందు దీని కోసం గుండెపోటు లక్షణాలను ఖచ్చితంగా సకాలంలో గుర్తించడం కూడా చాలా ముఖ్యం.ఇక చాలా సందర్భాలలో కూడా ఉదయం పూట నిద్రలేవగానే గుండె జబ్బుల గురించి శరీరం హెచ్చరిస్తుంది.అయితే చాలా మంది కూడా దానిని  అంతగా పట్టించుకోరు. కానీ అలా గుర్తించలేకపోవడం ఖచ్చితంగా మరణానికి కారణంగా మారుతుంది.


స్థూలకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపుడుతున్నవారు గుండెపోటు లక్షణాలను అస్సలు విస్మరించకూడదని డాక్టర్ లు అంటున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం చాలాసార్లు పొద్దున పూట ఎక్కువగా ఉంటుందని డాక్టర్ లు వివరిస్తున్నారు. డాక్టర్ లు దీనిని సిర్కాడియన్ రిథమ్ అని పిలుస్తారు. పొద్దున్నే బీపీ కూడా పెరగడం మొదలవుతుంది. దీంతో గుండెపోటు ఈజీగా రావచ్చు. ఇక అలాంటి పరిస్థితిలో ఈ లక్షణాలు ఉదయం పూట కనిపిస్తే ఖచ్చితంగా అప్పుడు అప్రమత్తంగా ఉండండి. చాలా సార్లు కూడా ఉదయం పూట ఛాతీలో మంట ఇంకా నొప్పి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చాలా సందర్భాలలో ప్రజలు దీనిని గ్యాస్ సమస్యగా కూడా భావిస్తారు. అలా నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ లు సూచిస్తున్నారు. ఉదయం పూట ఛాతీ నొప్పి ఉంటే, ఎడమ చేయి లేదా భుజం దాకా నొప్పి ఉన్నా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: