యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోవడం ఇంకా అలాగే గర్భిణీ స్త్రీలల్లో, డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. మసాలా కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, మద్యపాన సేవనం ఇంకా నీటిని తక్కువగా తాగడం వంటి కారణాల వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ల వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రం వచ్చినట్టు ఉండడం ఇంకా అలాగే వెన్ను భాగంలో ఒక్కసారిగా నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఖచ్చితంగా చికిత్స తీసుకోవడం చాలా అవసరం.అయితే యాంటీ బయాటిక్ లను వాడడం వల్ల ఈ సమస్య నుండి మనం చాలా ఈజీగా బయటపడవచ్చు. అయితే యాంటీ బయాటిక్ లకు బదులు ఆయుర్వేద టిప్స్ ని ఉపయోగించి మనం మరింత సులభంగా ఇంకా మరింత త్వరగా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ టిప్స్ వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ టిప్ తయారు చేసుకోవడానికి  మనం ఆపిల్ సైడ్ వెనిగర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగర్ ను వేసుకోవాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని ఇంకా ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి.


ఇలా తయారు చేసుకున్న నీటిని ఉదయం పూట అల్పాహారం తీసుకున్న అర గంట తరువాత అలాగే సాయంత్రం 4 గంటల సమయంలో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చాలా ఈజీగా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. గంటకు ఒకసారి పుల్లగా ఉండే పండ్లను వారు తీసుకోవాలి.ఇలా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉదయం పూట పరగడుపున గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కూడా యూరిన్ ఇన్పెక్షన్ సమస్య చాలా ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. ఇంకా అలాగే ప్రతిరోజూ నీటిని ఖచ్చితంగా ఎక్కువగా తాగాలి. అలాగే మూత్రవిసర్జన చేసిన తరువాత ఆ భాగాన్ని ఖచ్చితంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా ధనియాల కషాయాన్ని తాగాలి. మూత్రంలో ఇన్ఫెక్షన్ ని తగ్గించడంలో ధనియాల కషాయం చాలా బాగా పని చేస్తుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడే వారు ఆ సమస్య తగ్గే దాకా అసలు లైంగిక చర్యలల్లో పాల్గొనకూడదు. ఈ విధంగా ఈ టిప్స్ ని పాటించడం వల్ల మనం చాలా ఈజీగా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: