ఇంగువ.. హింగ్, అసిఫిటిడ, ఇండియాలో బాగా పాపులర్ అయిన వంటగది మసాలా దినుసు. ముఖ్యంగా ఇంగువ‌కు భారతీయ వంటకాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.  పప్పు, సాంబారు, పులిహోరలో కాసింత ఇంగువ వేస్తే వాటి రుచే వేరు అనేవాళ్లు ఎంద‌రో. ఇంగువ మంచి న్యూట్రీషియన్ ఫుడ్ . ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, కెరోటిన్ మరియు రిబోఫ్లోవిన్ లు పుష్కలంగా ఉన్నాయి.  ఘాటువాసనతో ఉండే దీనిలో ఔషధ గుణాలు బోలెడు ఉన్నాయి.

 

ఇంగువలోని యాంటీఇన్ల్ఫ‌మేటరీ లక్షణాలు తలలోని ఇన్ల్ఫ‌మేషన్ ను తగ్గిస్తుంది. ఒక కప్పు నీటిలో చిటికెడు ఇంగువ మిక్స్ చేసి రోజులు మూడు సార్లు తీసుకుంటే తలనొప్పి నుండి సులువుగా ఉపశమనం ల‌భిస్తుంది. వాస్త‌వానికి ఇంగువ పురాతన కాలం నుండి ఒక ట్రెడిషినల్ మెడిసినల్ గా ఉపయోగిస్తున్నారు. ఇంగువను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా దంతాల నొప్పి, స్టొమక్ ప్రాబ్లెమ్స్ మరియు చెవి నొప్పి వంటి వాటిని చికిత్సలా పనిచేస్తుంది.

 

శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్ ఇంగువ, శరీర కణాలను స్వేచ్చా రాశుల నుండి కాపాడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇంగువ వ్యతిరేక కాన్సర్ లక్షణం ప్రాణాంతక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. అంతేకాదు, అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో సమర్థవంతమైన చికిత్స కోసం కూడా ఈ ఔషధ లక్షణాలున్న ఇంగువను వాడతారు. మ‌రియు పంటి నొప్పి బాధిస్తుంటే ఇంగువని నిమ్మరసంలో కలిపి ఒక దూదిలో ఉంచి పుప్పి పంటిలో ఉంచితే నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. 

 
 
 
 
 
 
 
   
 

మరింత సమాచారం తెలుసుకోండి: