ప్రస్తుత కాలంలో డాక్టర్లు ప్రధానంగా రోగులను తేనెను ఉపయోగించాలని సూచిస్తున్నారు. శరీరానికి తేనె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజానాలు కలుగుతాయి. దాదాపు 4000 సంవత్సరాల నుండి తేనెను ఔషధ మూలికగా ఉపయోగిస్తున్నారు. తేనె శరీరంలో ఎర్ర రక్త కణాలను, హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతుంది. రక్తానికి ఆక్సిజన్ ను అందజేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. చక్కెరకు ప్రత్యామ్నాయంగా తేనెను ఉపయోగిస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. 
 
తేనెను రోజూ తీసుకుంటే శరీర వ్యవస్థ ఎంతో శక్తివంతమవుతుంది. తేనెను గాయాలకు ఉపయోగిస్తే బాక్టీరియాను నాశనం చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. తేనెలో ఉండే గ్లూకోజ్ శరీరానికి తక్షణం శక్తినిస్తుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం లాంటి సమస్యలకు తేనె మంచి మందుగా ఉపయోగపడుతుంది. ఎలర్జీలను తగ్గించడంలో కూడా తేనె ఎంతో సహాయపడుతుంది. తేనెతో చెమట వల్ల వచ్చే చర్మ రోగాలను, చుండ్రును నియంత్రించవచ్చు. 
 
అనేక అధ్యయనాల్లో తేనె వాడకం వల్ల త్వరగా నిద్ర పడుతుందని తేలింది. 12 ఏళ్ల లోపు పిల్లలకు తేనెను ఇవ్వకపోవడమే మంచిది. తేనె సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థం. ఆయుర్వేదంలో తేనెను ఔషధ మూలికలతో కలిపి వినియోగిస్తారు. తేనెను మందులతో కలిపి తీసుకుంటే తేనె శరీరమంతా మందును వ్యాపించేలా చేస్తుంది. తేనెలలో అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన మలైతేన్ అనే తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: