మామిడిపండ్లు.. ఎంతో టేస్టీ ఈ పండ్లు ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. సీజనల్ గా వచ్చే ఈ పండ్ల‌ను ప్రతి ఒక్కరి తిన‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు. ఇక అత్యథికంగా మామిడిని దిగుబడి చేసే దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. దాదాపు ప‌దిహేను వంద‌ల రకాల మామిడి పండ్లు ఇండియాలో పండుతాయంటే ఇక్క‌డ మామిడి పండ్ల క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు. మామిడిపండ్లు తింటున్నారు స‌రే.. మ‌రి వాటి వ‌ల్ల ఆరోగ్యానికి ఉప‌యోగం ఏంటి..? అస‌ల ఆరోగ్యానికి మామిడిపండ్లు మంచివేనా..? అన్న‌వి తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం.

 

పండ్లలో రారాజు మామిడి పండ్లు. ఎండాకాలంలో అధికంగా లభించే ఈ మామిడిపండ్ల తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. సాధాన‌ఫంగా మామిడి పండ్లు తింటే బరువును పెరుగుతామని, వేడి చేస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ, రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. మామిడి పండులో ఉండే పోటాషియం మరియు మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.ఇందులో ఉండే మిటమిన్ సి మరియు ఫైబర్ శరీరంలో హనీ చేసే కొలెస్ట్రాలను తగ్గిస్తాయి.

 

మామిడి పండులో ఐరన్ సంవృద్దిగా లబిస్తుంది.అందువల్ల రక్తహీనత సమస్యతో భాధపడే వారు మామిడి పండును డైట్‌లో చేర్చుకోవ‌డం మంచిది. అలాగే మామిడి పండ్లలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే బీటా కెరోటిన్ అనే పదార్ధం సంవృద్దిగా ఉంది. ఇక మామిడి పండులో లభించే ఫైబర్ అనేది నేచురల్ కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేసి బ్లడ్ షుగర్ లెవల్స్ ని స్టేబుల్ గా ఉంచేందుకు తోడ్పడుతుంది. మ‌రియు మామిడి పండ్లలో ఉండే మిటమిన్ ఎ కంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని మామిడిపండ్ల‌ను ఓవ‌ర్ తీసుకుంటే మాత్రం.. ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబ‌ట్టి, లిమిట్‌గా రోజు మామిడిపండ్ల‌ను హ్యాపీగా తినండి.
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: