దేశంలో త్వరలోనే మరో విదేశీ టీకా అందుబాటులోకి రాబోతోంది. ఎమర్జెన్సీ వినియోగం కోసం అమెరికాకు చెందిన మేడర్న టీకా దిగుమతి, ముంబైకి చెందిన సిప్లా కంపెనీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు మంజూరు చేసింది. దేశంలో అందుబాటులోకి రానున్న నాలుగవ టీకా ఇది. తమ భారత భాగస్వామి సిప్లా ద్వారా మేడెర్నా సంస్థ దరఖాస్తు చేసుకున్నదని, పరిమితులతో కూడినటువంటి అత్యవసర వినియోగానికి ఈ మేడర్న టీకాను అనుమతులు మంజూరు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జై అండ్ జె, ఫైజర్, వ్యాక్సిన్లను భారతదేశంలో తీసుకురావడంపై అనేక చర్చలు కొనసాగుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యులు పాల్ తెలిపారు.
అంతర్జాతీయ టీకా సరఫరా కూటమి కోవాక్సితో భారతదేశానికి తమ టీకాలు అందజేసేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయించిందని మెడెర్నా సంస్థ గత ఆదివారం రోజున భారత ఔషధ నియంత్రణ సంస్థకు తెలియజేసింది. అందుకు అనుమతులు ఇవ్వాలని కూడా కోరింది. సోమవారం రోజున మేడర్న తరఫున సిప్లా కంపెనీకి భారత ఔషధ నియంత్రణా సంస్థ దరఖాస్తు చేసుకున్నది. దేశంలో టీకాల కొరత ఏర్పడిన నేపథ్యంలో వ్యాక్సిన్ యొక్క అనుమతుల ప్రక్రియను కేంద్రం సరళతరం చేసిందని చెప్పవచ్చు. అమెరికాకి సంబంధించిన ఎఫ్ డి ఎ, ఈ ఎం ఏ, బ్రిటన్కు చెందిన ఎం హెచ్ ఆర్ ఓ, జపాన్కు చెందిన పి ఎన్ డి ఏ తో పాటు డబ్ల్యూహెచ్వో అనుమతి లభించిన టీకాలకు భారత్లో బ్రిడ్జి ట్రయల్స్ నిర్వహించకుండానే అనుమతులు మంజూరు చేయనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలియజేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి