వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎంతోమంది ఆనంద పడి పోతూ ఉంటారు. ఎండాకాలం వేడితో అలసిపోయిన ఎంతోమంది వర్షాకాలంలో తడి ముద్దవ్వాలి అని భావిస్తూ ఉంటారు. అయితే ఇలా సినిమాటిక్ ఊహలు బాగానే ఉంటాయి కానీ నిజజీవితంలో కి వచ్చేసరికి మాత్రం వర్షాకాలంలో గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే  వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు దూసుకువచ్చి అందరిని ఆసుపత్రుల పాలు చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే వర్షాకాలం వచ్చిందంటే జనాలు బెంబేలెత్తి పోతుంటారు.



 ఇక ఇప్పటికే వర్షాకాలం వచ్చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు ఎక్కువగానే కురుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.  అయితే ఓ వైపు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటి సీజనల్ వ్యాధులు మాత్రమే కాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా ఎంతో మందిని వర్షాకాలంలో వేధిస్తూ ఉంటాయి.  అందుకే వర్షాకాలంలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండటానికి  కొన్ని వంటింటి చిట్కాలు పాటించడం ఎంతో మేలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వర్షాకాలంలో పాటించాల్సిన చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



 వర్షాకాలంలో తమలపాకు రసం తాగడం వల్ల శ్వాస సమస్యలు,  ఊపిరితిత్తుల్లో కఫం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని. మజ్జిగలో వెల్లుల్లి కలుపుకొని తాగితే గురక రక్త సరఫరా సమస్యలు, రక్తం చిక్కబడటం లాంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుందట. గంధం కర్పూరం లాంటి లేపనాలు చర్మానికి రాసుకోవడం వల్ల దోమల నుంచి రక్షించుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. వర్షాకాలంలో ఆవ పిండితో చేసిన వంటకాలు తినడం వల్ల అంటు వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు అని చెబుతున్నారు.  ఇలా వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: