అర్ధరాత్రి సమయంలో ఫుడ్ తినడం వల్ల ప్రాణాపాయమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువగా కనుక తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగడంతో పాటు అలాగే కొవ్వు పదార్థాలు కూడా పెరిగి
గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.అలాగే వీటితో పాటు మెదడుపై లేట్‌నైట్ ఫుడ్ ఎక్కువ ప్రభావం చూపుతుందని ఇటీవల పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో కూడా వెళ్లడయ్యింది.ఇక ఎవరైనా కాని అర్ధరాత్రి తిండి తింటుంటే 'దెయ్యం తిండి తినటం అసలు మంచిది కాదు' అని పెద్దలు చాలా సందర్భాల్లో కూడా అంటుంటారు. అర్ధరాత్రి ఆహారం తింటే అనారోగ్యం బారిన పడతారనే ఉద్దేశంతో పెద్దలు అలా చెబుతుంటారు. ఇక నగరాల్లో అయితే ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం ఇంకా స్నాక్స్ తీసుకుంటుంటారు. అలాగే
టీవీ చూస్తూ ఇంకా సెల్‌ఫోన్‌లో నెట్ సర్ఫ్ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలీకుండా బాగా ఇష్టంగా లాగిస్తుంటారు.
ఇలా కేవలం టైంపాస్ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు ఇంకా అలాగే జంక్‌ఫుడ్ మెదడుపై చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవలే పరిశోధనల్లో తేలింది. అలాగే దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇక
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కొందరు శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు లేట్‌నైట్ జంక్‌ఫుడ్ తినే వారిని జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో భాగంగా వారి వివరాలను పొందుపరిచారు. ఇక పడుకునే ముందు జంక్‌ఫుడ్ అలాగే స్నాక్స్ తినేవారిలో మెదడు చాలా తీవ్ర ప్రభావానికి గురైందని గుర్తించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి కూడా అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలడం జరిగింది. అలాగే
గుండె పోటుతో కూడా చనిపోతారట.అందుకే అర్ధరాత్రి సమయంలో ఆహారం ఇంకా అలాగే స్నాక్స్ తీసుకోకపోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.