కరోనా విషయంలో పలు దేశాల టీకాల కంటే భారత్ లో తయారైనవి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని కొత్త వేరియంట్ వలన తెలుస్తుంది. ఇతర దేశాలలో కొత్త వేరియంట్ ప్రబలంగా ఉండటానికి కారణం వాళ్ళ టీకాల ని, అవి ప్రభావవంతంగా కొత్త వేరియంట్ ను ఎదురుకోలేకపోతున్నాయని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. అందుకే ఆయా దేశాలలో కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కవగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఒక స్థాయిలో ఆయా దేశాలు మళ్ళీ లాక్ డౌన్ వైపు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఫిబ్రవరి లో కొత్త వేరియంట్ పూర్తి ప్రభావాన్ని చూడబోతున్నాం. దానిని అందరు సంసిద్ధంగా ఉండాల్సిందే. ఈ స్థితిలో కాస్త భయానక పరిస్థితులు తప్పవని, ఇదంతా వ్యాప్తి వలన వచ్చిన ప్రమాదం అని అందరు గుర్తించాలి.

సహజంగా అయితే ఇతర వేరియంట్ల కంటే ఈ కొత్త వేరియంట్ పెద్దగా ప్రమాదం కాదు, కానీ వ్యాప్తి అధికమైతే వనరులు తక్కువ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రమాదం దిశగా పరిస్థితులు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రిటన్ లాంటి దేశాలలో టీకా లు అంత ప్రభావవంతంగా లేకపోవడం తో ఈ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ఈ దేశంలో కూడా ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుతుంది. భారత్ లో కూడా కేసులు ఈ సమయానికే ఎక్కువగా కనిపించినప్పటికీ, పెద్దగా ప్రదమకరంగా అయితే ఉండబోదు. అంటే రెండో వేవ్ లో చూసినటువంటి పరిస్థితి మాత్రం ఉండబోదు. దానికి కారణం దేశంలో ప్రజలకు ఇచ్చిన టీకా ప్రభావవంతంగా ఉండటమే కారణం.

ఇది కొత్త వేరియంట్ వలన ప్రమాద శాతాన్ని చాలా తగ్గిస్తుందని హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్ తెలిపారు. దేశంలో మూడో వేవ్ ఫిబ్రవరిలో వస్తుంది అని, అయితే రెండో వేవ్ తరహాలో ప్రభావం ఉండదని ఆయన అన్నారు. బ్రిటన్ లాంటి దేశాలలో వాడిన టీకాలు స్వల్పకాలిక ప్రభావం మాత్రమే చూపుతున్నాయి. అందుకే అక్కడ మళ్ళీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్ లో స్వదేశీ టీకాలు వాడటం జరిగింది కాబట్టి ఇక్కడ మూడో వేవ్ ఎక్కువగా కనిపించబోదు. దేశంలో టీకాలు అందరికి వేగంగా అందిస్తున్నారు. దీనివలన కొత్త వేరియంట్ తో మూడో వేవ్ కూడా పెద్దగా ప్రభావం ఉండబోదు. ఇప్పటికే 12 రాష్ట్రాలలో 143 కొత్త వేరియంట్ కేసులు ఉన్నాయి. ప్రమాదం లేదు, ప్రభావం ఉండబోదు అన్నారని ఇష్టానుసారంగా ప్రవర్తించడం సబబు కాదు. ఎవరి జాగర్తలో వాళ్ళు ఉండాల్సి ఉంది. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలి.

ప్రభావం ఉండబోదు అనే సమాచారం చెప్పడానికి కారణం, ప్రజలలో ఇతర వ్యాపారస్తులలో లేనిపోని బయలు బయలుదేరి, అనవసర వస్తు కొనుగోళ్లు జరిగి, లేని పోనీ డిమాండ్ తయారవకూడదు అనేందుకే. అప్రమత్తత అందరికి మంచిది. తద్వారా అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. నిర్లక్ష్యం మాత్రం వద్దు. వాక్సిన్ వేయించుకోకపోతే ఆ పని మీద ఉండండి. పిల్లలకు ఇంకా అలాంటి సౌలభ్యం రాలేదు కాబట్టి వారికి నిబంధనలపై అవగాహనా కల్పించడం చాలా అవసరం. వాళ్ళు వాహకులు కాకూడదు. అసలు కరోనా శరీరంలోకి వస్తే, లోన అవయవాలను ఎంతోకొంత నాశనం చేసి పోతుంది. మిగితాది మందులు వాడటం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రావడం ద్వారా పాడైపోతాయి. అందుకే అసలు రాకుండా చూసుకోవడం భవిష్యత్తు ఆరోగ్యానికి కూడా ఉత్తమం అని గుర్తించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: