మనకు ఒక్కసారి షుగర్ వచ్చిందంటే దాన్ని తగ్గించలేము. షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. కొంత మంది ట్యాబ్లెట్లని వాడి వాడి తరువాత ఏకంగా ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కడుపు నిండా ప్రశాంతంగా తినాలన్నా చాలా భయమే..షుగర్ ఉంటే ఖచ్చితంగా శారీరక వ్యాయామం చేయాలి. ఒక్కోసారి కరెక్ట్ టైంకి తినడం కొంచెం ఆలస్యమైన వెంటనే నీరసం వచ్చేస్తుంది.ఇలాంటి బాధలు చాలా షుగర్ వ్యాధిగ్రస్తులు అనుభవిస్తుంటారు. అయితే ఈ షుగర్ వ్యాధి నుంచి రక్షణకు మెడిసిన్ ఎంత అవసరమో? అలాగే కొన్ని ఆహార అలవాట్లతో షుగర్ ను చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారు తెలిపే ఈ సూపర్ ఫుడ్స్ తింటే కంట్రోల్ లో పెట్టొచ్చు.ఇక పులియబెట్టిన ఎసిటిక్ యాసిడ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ని కూడా 20% తగ్గించడానికి సహాయపడుతుంది.అందుకే ఆపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకోండి.


అలాగే ధనియాలు బ్లడ్ లోని షుగర్ ని నియంత్రించే ఎంజైమ్ లను సక్రియం చేయడం ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ ను ఈజీగా అదుపులో ఉంచుతుంది. కాబట్టి వాటిని తీసుకోండి.వెల్లుల్లి కూడా చాలా మంచిది. దీన్ని తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి దివ్యఔషధంలా పని చేస్తుంది. ఇది షుగర్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్, ఇన్ ఫ్లమేషన్ ఇంకా అలాగే ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ను చాలా ఈజీగా అదుపులో ఉంచుతుంది. ఇంకా అలాగే రక్తపోటు సమస్యను కూడా చాలా ఈజీగా దూరం చేస్తుంది. ఇక మనం తినే కూరగాయల్లో తక్కువ క్యాలరీలు ఇంకా ఎక్కువ ఫైబర్ తో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను బాగా గణనీయంగా తగ్గిస్తాయి. పొట్లకాయ, వంకాయ, గుమ్మడికాయ, టమాటా, పచ్చి బఠాణి ఇంకా అలాగే క్యారెట్ వంటి ఆరోగ్యకరమైన కూరగాయలను కచ్చితం మీ ఆహారంలో చేర్చుకోవాలి.ఇంకా అలాగే పండ్లను తరచూ తీసుకోవడం రక్తంలో షుగర్ లెవెల్స్ ని చాలా ఈజీగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రాబెర్రీ, యాపిల్స్ ఇంకా ద్రాక్ష వంటి పండ్లను తింటే టైప్ -2 డయాబెటిస్ ను చాలా ఈజీగా అరికట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: