కర్పూరం అనేది మన ఇంట్లో ఎల్లప్పుడూ వుండే పదార్ధం. ఈ కర్పూరాన్ని సాధారణంగా పూజలో ఉపయోగిస్తారు. కానీ కర్పూరంలో మనకు తెలియని చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. సహజ కర్పూరం శరీరంలోని చాలా రకాల సమస్యలను ఈజీగా దూరం చేయడంతో పాటు ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కర్పూరంతో ఎలాంటి సమస్యలను తరిమికొట్టొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కర్పూరం వాడటం వల్ల మొటిమలు చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇది మొటిమలు అభివృద్ధి చెందకుండా బ్యాక్టీరియాను చాలా దూరంగా ఉంచుతుంది.ఇంకా అలాగే పాదాల్లో నొప్పి, వాపు సమస్య ఉంటే కర్పూరంలో నూనె కలిపి మసాజ్ చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. మీరు అలసిపోయినట్లు కనుక అనిపిస్తే, మీరు కర్పూరాన్ని నువ్వులు లేదా ఆవనూనెతో కలిపి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ కర్పూరం చుండ్రు, పొడిబారడం ఇంకా అలాగే జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలను కూడా ఈజీగా తొలగిస్తుంది.


కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు బాగా మెరుస్తుంది. అలాగే మీకు ఒత్తుగా, పొడవాటి జుట్టు కావాలంటే, కర్పూరం కలిపిన కొబ్బరి నూనెను అప్లై చేయడం చాలా మంచిది.అలాగే కర్పూరం చాలా చల్లదనాన్ని ఇస్తుంది. మీకు తలనొప్పి సమస్య ఉంటే, కర్పూరాన్ని అర్జునుడు బెరడు, తెల్ల చందనం ఇంకా శొంఠి కలిపి రాసుకుంటే తలనొప్పి నుంచి చాలా ఈజీగా మీకు ఉపశమనం లభిస్తుంది. మీకు తలనొప్పి వస్తే అర్జునుడి బెరడు, తెల్లచందనం ఇంకా శొంఠి సమపాళ్లలో కలిపి పేస్టులా చేసి తలకు బాగా పట్టిస్తే తలనొప్పి ఈజీగా పోతుంది.ముఖంపై మొటిమలు, మచ్చలు, మరకలు ఏదైనా ఉంటే, దానిని కర్పూరంతో ఈజీగా తొలగించవచ్చు.అలాగే కొబ్బరినూనెలో కర్పూరం కలిపి ముఖానికి రాసుకుంటే మచ్చలు ఈజీగా తొలగిపోయి చర్మం బాగుంటుంది.జలుబు, ఫ్లూని తగ్గించడంలో కర్పూరం చాలా రకాలుగా మేలు చేస్తుంది. మీకు జలుబు లేదా దగ్గు ఉన్నట్లయితే కర్పూరాన్ని గోరువెచ్చని ఆవాల నూనెతో కలిపి మర్దన చేసుకోండి. కర్పూరాన్ని వేడి నీళ్లలో వేసి పీల్చడం వల్ల మూసుకుపోయిన ముక్కు తెరుచుకుని జలుబు ఇంకా ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: