నరాల సంబంధిత సమస్యలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో మనం ఈ నరాలకు సంబంధించిన సమస్యలను చాలా ఎక్కువగా చూడవచ్చు. ఇంకా అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారిలో మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారిలో కూడా ఈ సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా అంతేకాకుండా పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే ధూమపానం, మద్యపానం ఎక్కువగా చేసే వారిలో కూడా నరాల సంబంధిత సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి.నరాల సంబంధిత సమస్యలను మనం చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మన ఇంట్లో ఉండే మసాలా దినుసులతో ఒక టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా నరాలకు సంబంధించిన అన్ని సమస్యల నుండి కూడా మనం చాలా ఈజీగా బయటపడవచ్చు.ఇక ఈ టీ ని తయారు చేసుకోవడానికి  మనం దాల్చిన చెక్కను, లవంగాలను ఇంకా అలాగే నల్ల యాలకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా దాల్చిన చెక్కను తీసుకొని దానిని పొడిగా చేసుకోవాలి. ఇంకా అలాగే రెండు లవంగాలను ఒక నల్ల యాలక్కాయను కచ్చా పచ్చాగా దంచాలి.


ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి చిన్న మంటపై వాటిని వేడి చేయాలి. ఇందులోనే పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఇంకా అలాగే దంచిన లవంగాలు అలాగే నల్ల యాలక్కాయ మిశ్రమం వేసుకుని మరిగించాలి. అలాగే ఈ నీటిని చిన్న మంటపై అర గ్లాస్ కషాయం అయ్యే దాకా బాగా మరిగించాలి. తరువాత ఈ టీ ని వడకట్టుకుని ఒక కప్పులోకి తీసుకోని ఆ టీ ని రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి.ఇక ఈ విధంగా ఈ టీని తయారు చేసుకుని తాగడం వల్ల నరాల బలహీనత సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ టీ తాగడం వల్ల నరాలల్లో ఉండే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. నరాల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. ఈ టీని తాగడం వల్ల నరాల సమస్యలు తగ్గడంతో పాటు కాలేయం ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. నరాల సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ టీని తయారు చేసుకుని వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: