మనం తప్పకుండా రోజు గాఢ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. గాఢ నిద్ర పోయినప్పుడే మనం రోజూ చాలా ఉత్పాహంగా పని చేసుకోవచ్చు.అయితే ఇలా మెలుకువ రాకుండా గాఢ నిద్ర పోవాలంటే మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి.ఇక ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే మన శరీరంలో ట్రిప్టోపాన్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి. ట్రిప్టోపాన్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉత్పత్తి అయితే మెలటోనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మనకు గాఢ నిద్ర పడుతుంది.గాఢ నిద్ర కావాలనుకునే వారు ప్రతి రోజూ కమలా పండ్ల రసాన్ని తీసుకోవడం మంచిది.ఎందుకంటే కమలా పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో ట్రిప్టోపాన్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో ఒక గ్లాస్ కమలా పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల మెలటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.


అందువల్ల మనకు చక్కటి గాఢ నిద్ర పడుతుంది. ఇలా జ్యూస్ ను తీసుకోవడంతో పాటు చీకటి పడిన తరువాత వీలైనంత వరకు కంటి మీద వెలుగు పడకుండా ఖచ్చితంగా చూసుకోవాలి.ఎందుకంటే కంటి మీద వెలుగు పడడం వల్ల, ఫోన్స్ చూడడం వల్ల మెలటోనిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది.ఇక ఈ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల నిద్ర సరిగ్గా రాదు. కాబట్టి రాత్రి పూట ఖచ్చితంగా ఫోన్స్ కి, టివీలకు వీలైనంత దూరంగా ఉండాలి. అందువల్ల గాఢ నిద్ర సొంతం చేసుకోవచ్చు.ఇంకా అలాగే రోజూ సాయంత్రం 6 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆలస్యంగా భోజనం చేసే అలవాటును ఖచ్చితంగా వదులుకోవాలి. త్వరగా భోజనం చేసి నిద్రించడం వల్ల మనం సుఖమైన గాఢ నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ నియమాలను పాటించడం వల్ల మనం చాలా ఈజీగా గాఢ నిద్రను పొందవచ్చని అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: