సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఆడియో లాంచ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్గా నిర్వహించారు చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి హీరో సూర్యతో పాటు చిత్ర బృందం కూడా హాజరయ్యింది. అయితే హీరోయిన్ త్రిష మాత్రం రాకపోవడంతో సోషల్ మీడియాలో చాలా దారుణమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది త్రిష సినిమాకి ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోందని కామెంట్స్ చేయగా, మరి కొంతమంది కరుప్పు ఆడియో ఫంక్షన్ కి అసలు త్రిష కి ఆహ్వానమే లేదంటు ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ కరుప్పు టీమ్ పై సెటైర్స్ వేస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ హీరోయిన్ త్రిష కి సంబంధించి ఫస్ట్ లుక్కుని కూడా విడుదల చేయడం జరిగింది. అందులో ప్రీతి అనే పాత్రలో లాయర్ గా కనిపించబోతోంది. 43 ఏళ్ల వయసులో త్రిష ఈ వీడియోలో చాలా యంగ్ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ త్రిష లుక్స్ పైన కూడా చాలానే ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఒక నేటిజన్ త్రిష ని ప్రశంసిస్తూ ఆమె ఏజ్ రివర్స్ గేర్ లో వెళ్తోంది అంటూ ట్వీట్ చేయగా.. ఈ విషయం పైన త్రిష రిప్లై ఇస్తూ థాంక్స్ నేను మర్చిపోయాను కనీసం ఇప్పటికైనా ఇలా గుర్తు చేసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ సెటైరికల్ గా ఒక ట్విట్ వేసింది. ఇందుకు సంబంధించి ట్విట్ వైరల్ గా మారింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి