వ్యక్తిగత ఇంటర్వ్యూలో కులం ప్రస్తావన రావడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. దీంతో అసహనానికి లోనైనా గెటప్ శ్రీను ఇంటర్యూని మధ్యలోనే ఆపేసి మరి తొక్కలో ఇంటర్వ్యూ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు ఈ వీడియోలో చూపించారు. ఈ ఇంటర్వ్యూ మహాదేవపట్నంలో జరగగా.. మొదట సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూ కొద్దిసేపటికి చాలా ఉద్రిక్తతగా మారిపోతుంది. ఒకానొక సందర్భంలో కుల ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా హీటెక్కిస్తోంది. ముఖ్యంగా గెటప్ శ్రీను" మేము కాపులం" అని చేసిన వ్యాఖ్యలు జాఫర్ చెప్పిన అభ్యంతరం వల్ల ఈ వీడియో మరింత రసవత్తంగా మారినట్టు కనిపిస్తోంది.
ముఖ్యంగా ఆ విషయంలో అలా మాట్లాడకూడదు అంటూ జాఫర్ అనడం గెటప్ శ్రీను మాట్లాడిన తీరు వీరిద్దరి మధ్య మాటలు యుద్ధంగా పెరిగింది. దీంతో మైక్ తీసి పక్కన పడేసి అక్కడ నుంచి వెళ్లిపోయిన గెటప్ శ్రీను పై.. జాఫర్ స్పందిస్తూ నేను ఏం తప్పుగా అడిగాను? ఆయన ఎందుకు అక్కడి నుంచి సీరియస్ అయ్యి వెళ్ళిపోయారు? అని అక్కడ ఉన్న వారిని ప్రశ్నించడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఇదంతా కూడా కేవలం వ్యూస్ కోసం చేసిన స్టంట లేకపోతే ఏంటా అనే విషయం తెలియాలి అంటే పూర్తి వీడియో బయటకి రావాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి