పిల్లల విషయంలో తల్లి దండ్రులు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారు తినే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా రకాల వ్యాధులు చాలా ఈజీగా వస్తున్నాయి. అందుకు కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. అందుకే మీ పిల్లలకు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం అలవాటు చెయ్యాలి. మీ పిల్లలు బలంగా ఇంకా షార్ప్ గా ఉండాలంటే కొన్ని ఆహారాలని వారికి తినిపించాలి. ఆ ఆహారాలు ఏవో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.కోడి గుడ్డు కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక గుడ్డు ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యంగా, హెల్దీగా తయారవుతారు. గుడ్డ తినడం వల్ల పిల్లల బ్రెయిన్ కూడా చురుకుగా పని చేస్తుంది. గుడ్డులో విటమిన్లు డి, బి6, బి12 వంటివి ఉంటాయి.పిల్లలకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి వారికి సాధారణమైన చాక్లెట్ల కంటే నట్స్ ఉన్నవి, డార్క్ చాక్లెట్స్ ఇవ్వడం బెటర్. ఇవి తినడం వల్ల బ్రెయిన్ అనేది యాక్టీవ్ అవుతుంది.గుమ్మడి గింజల్ని కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌లో ఒక భాగం. వీటిల్లో విటమిన్స్, ఖనిజాలు పుష్కలగా ఉంటాయి.


అదే విధంగా ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి వీటిని కూడా పిల్లలకు ఇవ్వడం మంచిది.అలాగే బ్లూ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది. మతి మరుపు దూరం అవుతుంది. జ్ఞాపక శక్తి పెరిగేందుకు కూడా బ్లూ బెర్రీస్ హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని కూడా పిల్లలకు పెడితే వారిలో మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది.చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇది పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదలకు, యాక్టీవ్‌గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా సాల్మన్ ఫిష్‌ని పిల్లల ఆహారంలో ఒక భాగం చేయాలి. ఇది తినడం వల్ల వారి మెదడు చురుకుగా పని చేస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ ఆహారాలని మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లల్ని ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: