ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా చాలా చిన్న వయసులోనే కొలెస్ట్రాల్‌ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు.ఈ కొలెస్ట్రాల్ అనేది ప్రాథమికంగా ఒక రకమైన లిపిడ్. మన శరీరానికి అవసరమైన విధులు నిర్వర్తించడానికి ఇది చాలా అవసరం.ఈ కొలెస్ట్రాల్ ఈస్ట్రోజెన్ ఇంకా టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లను తయారు చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం కూడా చాలా ముఖ్యం. అయితే దీని పరిమాణం పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యానికి చాలా ప్రమాదమే.మన బాడీలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ లేదా LDL మొత్తం పెరిగినప్పుడు ఖచ్చితంగా చాలా రకాల సమస్యలు వస్తాయి. అందుకే ఈ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఖచ్చితంగా కొన్ని ఆహారాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..


మీగడ పాలు ఇంకా దానితో చేసిన ఆహారం, నెయ్యి-వెన్న వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాగే తగినంత నీళ్లు త్రాగాలి. దానితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి. సరైన ఆహారాల అలవాట్లు సగం జబ్బులను నయం చేస్తుంది.రెడ్ మీట్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి ఆహారాలను పూర్తిగా మానుకోవాలి. అవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అలాగే, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కేకులు, కుకీలు, పేస్ట్రీలు, జున్ను, నెయ్యి, వెన్న, చీజ్, జామ్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.అలాగే కొన్ని రకాల పండ్లు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి రోజూ యాపిల్స్ తప్పక తినాలి.ఈ రోజుల్లో చాలా మంది ఓట్ మీల్ తింటున్నారు. ఇందులో కొలెస్ట్రాల్‌ను కరిగించి నియంత్రించడంలో సహాయపడే కరిగే ఫైబర్‌ ఉంటుంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వు కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి. అధిక కొవ్వుని చాలా ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: