సమ్మర్లో మానసిక స్థితి, శక్తి స్థాయిలను మెరుగుపరచడానికి  ఖచ్చితంగా సెరోటోనిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. చికెన్, గుడ్లు, చీజ్, సాల్మన్, నట్స్, విత్తనాలు, పైనాపిల్ వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇవి శారీరక శక్తి స్థాయిలను పెంచుతాయి. అలాగే వ్యాధుల నుంచి రక్షించడానికి ప్రోబయోటిక్ ఆహారాన్ని తీసుకోవాలి. పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా కూరగాయలలో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ ఆహారాలు శారీరక శక్తి స్థాయిలను పెంచడంలో కూడా సహాయపడతాయి. వేయించిన, చక్కెర పదార్ధాలను ఎంత ఎక్కువగా తింటే శక్తి అంత తక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోండి. ప్రాసెస్ చేసిన స్నాక్స్ తినడం వల్ల శరీరంలో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మన శరీరంలో శక్తి లోపించకుండా ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, మాంసం, గుడ్లు, పప్పులు, చీజ్ వంటి ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల పనితీరు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. సమ్మర్లో ఎక్కువగా  టీ, కాఫీ తీసుకోకపోవడమే మంచిది.


ఇందులోని కెఫీన్ తక్షణ శక్తిని అందించినా తర్వాత శారీరక అసౌకర్యాన్ని పెంచుతుంది. కెఫిన్ లేని టీని అంటే గ్రీన్ టీ, అల్లం టీ, పుదీనా టీ వంటివి తీసుకోవచ్చు. ఇవి అలసట నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. అలాగే సీజనల్ కూరగాయలు, తాజా పండ్లను ఎల్లప్పుడూ తినాలి. ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాహార లోపాన్ని పూరించడానికి, శారీరక బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ఎండా కాలంలో ఖచ్చితంగా రోజు ప్రారంభంలో తీసుకునే మొదటి భోజనం పోషకాలతో నిండినదై ఉండాలి. అందులో ఎంత ఎక్కువ ధాన్యాలు ఉంచుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. వోట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి ఆహారాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కడుపు నింపి శక్తిని అందిస్తాయి. బరువును కూడా తగ్గిస్తాయి.చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, మద్యపానం కారణంగా శరీరంలో ఖచ్చితంగా పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఆపై శారీరక అలసట ఇంకా బలహీనత ఏర్పడుతుంది. అందుకే వేసవిలో ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి పైన పేర్కొన్న డైట్ మెయింటైన్ చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: