
గాయానికి కొంత తేమ అవసరం. గాయం మీద యాంటీబయాటిక్ ఆయింట్‌మెంట్ లేదా పెట్రోలియం జెల్లీ వంటివి రాస్తే అది పొడిబారకుండా ఉంటుంది. ఇది కొత్త కణాలు పెరగడానికి సహాయపడుతుంది. గాయం పొడిబారితే కొత్త కణాలు ఏర్పడడం ఆలస్యం అవుతుంది. చిన్న గాయమైనా, పెద్ద గాయమైనా దానిని బ్యాండ్-ఎయిడ్ తో కప్పి ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇది గాయంపై దుమ్ము చేరకుండా నివారిస్తుంది. అయితే, గాయంపై వాడే బ్యాండేజ్ వదులుగా ఉండాలి. గాలి తగిలేలా ఉంటే ఇంకా మంచిది.
శరీరం గాయాలను త్వరగా నయం చేయడానికి పోషకాలు అవసరం. ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్ సి, జింక్ వంటివి గాయాలు త్వరగా మానడానికి చాలా అవసరం. కాయకూరలు, పండ్లు, ఆకుకూరలు, ప్రొటీన్ ఉండే మాంసం, గుడ్లు వంటివి తీసుకోవడం మంచిది. గాయం త్వరగా మానడానికి దానిపై శ్రద్ధ పెట్టాలి. ఎరుపు రంగులోకి మారడం, వాపు రావడం, చీము కారడం, ఎక్కువ నొప్పి ఉండటం వంటివి జరిగితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇవి ఇన్ఫెక్షన్ కు సంకేతాలు కావచ్చు.
ఈ చిట్కాలను పాటిస్తే, చిన్న గాయాలు చాలా త్వరగా నయమవుతాయి. తీవ్రమైన గాయాల విషయంలో మాత్రం తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు