మనలో చాలామందికి హోటల్‌కు వెళ్లి రకరకాల వంటకాలను రుచి చూడటం అంటే మహా ఇష్టం. అయితే, బయట దొరికే అన్ని పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా కొన్ని రకాల హోటల్ ఫుడ్స్ మన జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. హోటళ్లలో ఎక్కువగా వాడే 'అజినోమోటో' లేదా టెస్టింగ్ సాల్ట్ మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. అలాగే, చికెన్ మంచూరియా లేదా కబాబ్స్ వంటి వంటకాల్లో వాడే కృత్రిమ రంగులు క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం ఉంది. చాలా హోటళ్లలో నూనెను పదే పదే మరిగించి వాడుతుంటారు, ఇలా వాడటం వల్ల అందులో 'ట్రాన్స్ ఫ్యాట్స్' పెరిగి గుండె జబ్బులకు కారణమవుతాయి.
ముఖ్యంగా సగం ఉడికించిన మాంసం లేదా నాన్-వెజ్ ఐటమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా ఉడకని చికెన్ ద్వారా సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా శరీరంలోకి చేరి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. రోడ్ సైడ్ దొరికే నిల్వ ఉంచిన సాస్‌లు, మయోనైజ్ వంటివి కూడా త్వరగా పాడైపోయే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండటమే మంచిది. అలాగే, రంగురంగుల ఐస్ క్రీమ్స్ మరియు కూల్ డ్రింక్స్‌లో అధిక మోతాదులో ఉండే చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఊబకాయానికి మరియు మధుమేహానికి పునాది వేస్తాయి. చాలా హోటళ్లలో ముందు రోజు మిగిలిపోయిన కూరలను ఫ్రిజ్‌లో ఉంచి, మరుసటి రోజు వేడి చేసి వడ్డిస్తుంటారు.
ఇలా చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు నశించి, విషతుల్యంగా మారుతుంది. ముఖ్యంగా మసాలాలు ఎక్కువగా ఉండే గ్రేవీలు గ్యాస్ట్రిక్ సమస్యలను పెంచుతాయి. రాత్రి సమయాల్లో ఇలాంటి భారమైన ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తుతాయి. బయట తినేటప్పుడు రుచికంటే శుభ్రతకు, ఆరోగ్యాన్ని ఇచ్చే తాజా పదార్థాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే ఆ ఒక్క పూట రుచి జీవితకాలం అనారోగ్యానికి దారితీయవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, కాబట్టి ఆహారం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి