శర్వానంద్ మంచి స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి .. మం చి విజయాన్ని అం దు కు న్నా డు . ఇప్పు డు ‘బైకర్’ తో వచ్చా డు. నేడు ధియేటర్స్ లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.  ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇదే కావడం గమనార్హం.  మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శర్వా ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

శర్వానంద్ నటించిన “బైకర్” సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా మాత్రమే కాకుండా, భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథగా కూడా నిలుస్తుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం తెలుగు తెరపై కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

కథ :

విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్) ఒక ప్రతిభావంతమైన మోటోక్రాస్ రేసర్. అతని తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) , “బుల్లెట్ సునీల్”గా ప్రసిద్ధి పొందిన వ్యక్తి, అతని గురువు కూడా. భారతదేశంలో మోటోక్రాస్ రేసింగ్‌కు గుర్తింపు తీసుకురావాలన్న తండ్రి కలను నెరవేర్చడానికి విక్కీ కష్టపడుతూ దేశంలోనే నంబర్ వన్ రేసర్‌గా ఎదుగుతాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రి సునీల్ నారాయణ్ పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ పొంది, రేసింగ్‌లో అగ్రస్థానానికి చేరుకున్న తరువాత అంతర్జాతీయ స్థాయికి చేరుకునే దశలో అతను అకస్మాత్తుగా రేసింగ్‌ను వదిలి సాధారణ జీవితం ఎంచుకుంటాడు. ఇదే సినిమాకి అసలైన ట్విస్ట్. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటి? అనన్య (మాళవిక నాయర్) అతని జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమి మారింది? తిరిగి రేసింగ్‌లోకి రావడానికి అతన్ని ప్రేరేపించిన సంఘటనలు ఏమిటి? తండ్రి-కొడుకుల మధ్య ఏర్పడిన విభేదాలు ఎలా పరిష్కారమయ్యాయి? చివరకు విక్కీ తన లక్ష్యాన్ని సాధించాడా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసే వరకు ఆసక్తిగా ఉంచుతుంది.

సినిమా విశ్లేషణ:

తెలుగు సినిమాల్లో స్పోర్ట్స్ డ్రామాలు కొత్తవి కావు. కానీ మోటోక్రాస్ రేసింగ్‌ను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కిన సినిమా ఇది మొదటిదనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమా జనాలని ఆకట్టుకుంది అని చెప్పడంలో నో డౌట్.  కథ పరంగా చూస్తే, ఇది ఒక క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామా ఫార్మాట్‌ను అనుసరిస్తుంది .  హీరో ఎదగడం, ఒక దశలో వెనక్కి తగ్గడం, మళ్లీ తిరిగి వచ్చి విజయం సాధించడం. ఇలాంటివి గతంలో చాలా చూసిన ఈ కథనంలో ఉన్న భావోద్వేగాలు పూర్తిస్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. కథలో కాన్ఫ్లిక్ట్ జనాలకి బాగా నచ్చేసింది. కొన్ని సన్నివేశాలు మరింత బలంగా  సినిమా స్థాయి ఇంకాస్త పెరిగేలా చేశాయి. మరీ ముఖ్యంగా  రేసింగ్ సన్నివేశాలు మాత్రం సినిమాకు ప్రధాన ఆకర్షణ. అవి ఎంతో రియలిస్టిక్‌గా, ఉత్కంఠభరితంగా చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు చూస్తుంటే గూస్‌బంప్స్ రావడం ఖాయం. ప్రత్యేకంగా క్లైమాక్స్ రేస్ సన్నివేశం ప్రేక్షకులను సీట్లో కట్టిపడేస్తుంది. అరుపులు కేకలతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేలా చిత్రీకరించారు.

భావోద్వేగాలు & డైలాగులు :

తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలు కథకు హృదయం. “చీకటి గదిలో కూర్చొని ఎవరో రాసిన కథలు చూస్తూ ఉంటే… నీ కథను నువ్వు రాయలేవు” అనే డైలాగ్ చాలా అర్థవంతంగా, ప్రేరణాత్మకంగా ఉంటుంది. అయితే భావోద్వేగ సన్నివేశాలను ఇంకా బలంగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు ఎక్కువగా రేసింగ్ సీన్స్‌పైనే దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది.

నటీనటుల ప్రదర్శన:

ఈ సినిమాకు ప్రధాన బలం శర్వానంద్ నటన. అతను ఈ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఫిట్‌నెస్, లుక్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఒక నిజమైన రేసర్‌లా అనిపిస్తాయి. యాక్షన్, ఎమోషన్ — రెండింటిలోనూ అతను తన ప్రతిభను చాటుకున్నాడు. శర్వా టాలెంట్ గురించి అందరికి తెలుసు. అది మరొకసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. రాజశేఖర్ పోషించిన బుల్లెట్ సునీల్ పాత్ర సినిమాకు కీలకం. ఎక్కువ డైలాగులు లేకపోయినా, ఆయన పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. తన అనుభవంతో ఆయన తన పాత్రకు ఇంకా బలం చేకూర్చాడు అని చెప్పడంలో సందేహమే లేదు. మాళవిక నాయర్ తన పాత్రకు తగ్గట్టు చక్కగా నటించింది. ఆమె నటనలో సహజత్వం ఉంది. రొమాంటిక్ సన్నివేశాలు సింపుల్‌గా ఆకట్టుకుంటాయి. బ్యాక్ సీట్ లో పాటలో ఆమె డ్యాన్స్ ఇరగదీసింది. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు:

దర్శకుడు అభిలాష్ రెడ్డి ఒక విభిన్నమైన క్రీడను ఎంచుకుని, దానికి భావోద్వేగాలను జోడించి మెప్పించడంలో సక్సెస్ అయ్యారు. గిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. సినిమా సక్సెస్ కి ఇది ప్రధాన కారణం అని చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాల్లో బీజీఎం థ్రిల్‌ను రెట్టింపు చేస్తుంది. పాటలు కథకు అనుగుణంగా వస్తాయి. ఇక సినిమాటోగ్రఫీ అత్యుత్తమంగా ఉంది. ట్రాక్‌పై జరిగే రేసింగ్ సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎడిటింగ్ మాత్రం కొన్ని చోట్ల కాస్త లాగ్ అనిపిస్తుంది. నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

* తెలుగులో ఇప్పటివరకు రాని మోటోక్రాస్ రేసింగ్ క్రీడను నేపథ్యంగా ఎంచుకోవడం
* రేసింగ్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు హైలెట్.
* శర్వానంద్ నటన
* ‘యాంగ్రీ మ్యాన్’ రాజశేఖర్ గౌరవప్రదమైన పర్ ఫామెన్స్
* రేసింగ్ సన్నివేశాల కొరియోగ్రఫీ
* జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ
* గిబ్రాన్ నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:

* స్పోర్ట్స్ డ్రామాలో ఉండే పాత ఫార్ములా
* కధ సాగదీత
* ప్రిడిక్టబుల్ సీన్స్
* కొన్ని సీన్స్ లో మిస్ అయిన ఎమోషన్స్

తుది మాట: మొత్తంగా చెప్పాలంటే.. ‘బైకర్’ సినిమా  ఒక ఆసక్తికరమైన మరియు ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఇది కేవలం ఒక స్పోర్ట్స్ మూవీ మాత్రమే కాదు. ఇది ఒక తండ్రి-కొడుకు బంధం, ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయాణం.. అలాగే కుటుంబంతో కూడిన భావోద్వేగ కథ. ఈ బైకర్ రైడ్ దేశానికి మెడల్ తెచ్చే ది మాత్రమే కాదు.. ఇది ఒక సుదీర్ఘమైన కుటుంబ ప్రయాణం కూడా. స్పోర్ట్స్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.  

రేటింగ్: 3.25/5






మరింత సమాచారం తెలుసుకోండి: