నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది యువతలో కిడ్నీలో రాళ్ల సమస్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలామంది ఇలాంటివి తెలియగానే బీరు తాగితే రాళ్లు పడిపోతాయని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఈ మాటలలో ఎంతవరకు నిజం ఉంది? బీరు నిజంగా కిడ్నీ రాళ్ళను బయటకి పంపిస్తుందా లేదా అనే విషయంపై న్యూఢిల్లీలో ఉండే ప్రముఖ యూరాలజీ విభాగం వైస్ చైర్మన్ డాక్టర్ అమరేంద్ర పాఠక్ పలు సంచలన విషయాలను బయటపెట్టారు.



మన శరీరంలో ఉండే క్యాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు మన మూత్రపిండంలో పేరుకుపోవడం వల్ల అవి చిన్న చిన్న స్పటికాలుగా మారుతాయి. ఇవే నెమ్మదిగా రాళ్ల లాగా మారుతాయి. ఇది నాలానికి అడ్డంకి కలిగించినప్పుడు విపరీతమైన నొప్పి లేదా మంట మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే బీరు తాగితే రాళ్లు కరిగిపోతాయి అనేది కూడా ఒక భ్రమ అంటూ డాక్టర్ అమరేంద్ర పాఠక్ తెలియజేశారు. బీరు తాగడం వల్ల శరీరంలో మూత్ర ఉత్పత్తి మాత్రమే పెరుగుతుందని తెలిపారు. అయితే ఇందుకు బదులు మంచినీళ్లు లేదా నిమ్మరసం తాగడం మంచిదని సలహా ఇస్తున్నారు.


దీనిలో ఉండే ఆల్కహాల్ శరీరాన్ని చాలా హానికరం చేస్తుందని వ్యాసనానికి దారితీస్తుంది బీరు తాగడం వల్ల ఒక్కసారిగా మూత్రం పెరిగిపోయి , రాయి అడ్డం పడితే కిడ్నీలో వాపు వచ్చే పరిస్థితి ఉంటుందని తెలుపుతున్నారు. బీరు తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా పెరిగి అది కాలేయ సమస్యలకు దారితీస్తుందని తెలుపుతున్నారు. 5 మి.మి   చిన్నగా ఉండే రాళ్లు మంచినీటిని ఎక్కువగా తాగడం ద్వారా మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. నీరు తాగడం వల్ల పలుచగా చేసి రాళ్లను సులభంగా కదిలించేలా చేస్తాయి. కానీ రాయి పెద్దగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వైద్యం సలహా అవసరమని తెలియజేస్తున్నారు. బీరు తాగడం వల్ల కిడ్నీ రాళ్లు మాయమవుతాయి అనేది ఒక అపోహ మాత్రమే అంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: