ఎమ్మెస్ స్వామినాథన్ జననం : జన్యు శాస్త్రవేత్త అంతర్జాతీయంగా పేరుపొందిన హరితవిప్లవం నిర్వాహకుడు అయిన ఎమ్మెస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7వ తేదీన జన్మించారు. ఇతనిని భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా అభివర్ణిస్తారు. వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు ఎమ్.ఎస్.స్వామినాథన్. ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి దాని ఛైర్మెన్ గా వ్యవహరించారు ఎం.ఎస్.స్వామినాథన్. ఎంతో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి వాటి నుంచి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశారు ఈయన. వరి గోధుమ మొదలైన పంటలపై ఆయన జరిపిన విశేష కృషి వలన భారత దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవం సాధించింది.
బెజవాడ గోపాల్ రెడ్డి జననం : స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి అయిన బెజవాడ గోపాల్ రెడ్డి 1907 ఆగస్టు 7వ తేదీన జన్మించారు. పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా రచించారు. పరిపాలనాదక్షుడు గా కేంద్ర రాష్ట్రాల్లో మంత్రిపదవులు అలంకరించాడు బెజవాడ గోపాల్ రెడ్డి . ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి గానే గాక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు బెజవాడ గోపాల్ రెడ్డి.సాహితీ రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకొని 90 సంవత్సరాల జీవితాన్ని పరిపూర్ణ ఆరోగ్యంతో గడిపిన వ్యక్తి బెజవాడ గోపాల్ రెడ్డి.
సుత్తివేలు జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు అయిన సుత్తివేలు 1947 ఆగస్టు 7వ తేదీన జన్మించారు. నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 200 సినిమాలకు పైగా నటించిన సుత్తివేలు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో మెప్పించారు. ఎలాంటి పాత్రలోనైనా వాస్తవికతకు దగ్గరగా ఉండేలా నటిస్తూ... ఎంతోమందిని మెప్పించారు సుత్తివేలు.
రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం : భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7వ తేదీన పరమపదించారు. రవీంద్రుని గా ప్రసిద్ధుడైన ఈయన గీతాంజలి అనే కావ్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు . నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి గా రికార్డు సృష్టించాడు. మొదటి నుంచి జాతీయ భావాలు కలిగి ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్... పలు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి