గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 23వ  ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం..

ముఖ్య సంఘటనలు

1990: అయోధ్యకు రథయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీని బీహార్ లోని సమస్తిపూర్ లో అరెస్టు చెయ్యడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది.


ప్ర‌ముఖుల జననాలు

1873: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975)
1923: భైరాన్‌సింగ్ షెకావత్ భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి [మ. 2010].1923, అక్టోబర్ 23 న జన్మించిన భైరాన్‌సింగ్ షెకావత్  భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. కృష్ణకాంత్ మరణానంతరం 2002 ఆగస్ట్లో నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో గెల్చి 2007 జూలై 21 వరకు రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో ప్రతిభా పాటిల్ చేతిలో ఓడి రాజీనామా సమర్పించే వరకు ఆ పదవిలో కొనసాగినాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1977 నుంచి 1980, 1990 నుంచి 1992, 1993 నుంచి 1998 వరకు 3 పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించాడు. తన హయంలో ప్రారంభించిన పేదరిక నిర్మూలన కార్యక్రమమైన అంతోద్యయ పథకం ఆయనకు ఎంతో కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.87 సంవత్సరాల వయస్సులో శ్వాససంబంధ సమస్యలతో 2010, మే 15 న జైపూర్లో మరణించాడు.
1924: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. సృష్టికర్త. (మ.2015)
1924: కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు. (మ.2003)
1930: ముమ్మడివరం పెద్దబాలయోగి, ప్రజల మధ్య ఉంటూనే నిత్యం తపస్సమాధిలో ఉండిపోయిన యోగి (మ.1985).
1939: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారుడు. ఈయన కార్టూన్‌లు 1960 దశకం చివరి రోజులనుండి దాదాపు 1980ల వరకు అనేక వార, మాస పత్రికలలో వచ్చినవి [ మ.2002].
1940: పీలే, బ్రెజిల్‌ ఫుట్‌బాల్ ఆటగాడు.
1969: సంజయ్ గుప్తా, అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు.
1979: ప్రభాస్, తెలుగు సినిమా నటుడు.
1985: ప్రదీప్ మాచిరాజు, టివి వ్యాఖ్యాత (యాంకర్)

ప్ర‌ముఖుల మరణాలు


1623: తులసీదాసు, హిందీ రామాయణకర్త (జ.1532).
2007: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927).
1980: న్యాయపతి కామేశ్వరి, రేడియో అక్కయ్యగా పేరుపొందినది, న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది (జ.1908).



మరింత సమాచారం తెలుసుకోండి: