బిడ్డ పుట్టిన తర్వాత ఏ వయసులో ఎలాంటి ఆహారం పెట్టాలో అన్నా సందేహంలో చాలా మంది తల్లితండ్రులు ఉంటారు. అయితే పుట్టిన దగ్గర నుండి 6 నెలల వరకు పిల్లలకు తల్లిపాలు తప్పకుండ పట్టించాలి. ఆ తర్వాతనే ఏదయినా ఆహారం పెట్టాలి. అసలు పిల్లలకు ఏ నెలలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో తెలుసుకోండి.. !!6 నెలల తర్వాత శిశువులకు ఇంగువ ఇవ్వొచ్చు. ఇంగువను ఖిచిడి లో కలపొచ్చు. శిశువు ఆహారంలో కేవలం చిటికెడు మాత్రమే జోడించాలి.ఇంగువతో వాడడం వల్ల గ్యాస్ నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే పిల్లలకు సులభంగా ఆహారం  జీర్ణం అవ్వటానికి సహాయపడుతుంది.



అలాగే 8 నెలల తర్వాత పిల్లలకు కుంకుమపువ్వు ఇవ్వొచ్చు. కుంకుమ పువ్వును ఖీర్స్, డ్రై ఫ్రూట్ పౌడర్, షీరా లో ఉపయోగించవచ్చు. శిశువు ఆహారంలో ఎంత కుంకుమపువ్వు వేయాలి అనే ప్రశ్న మీకు రావచ్చు. అయితే  వంట చేసేటప్పుడు ఒకటి లేదా రెండు వేయచ్చు. అలంకరించుకుంటే తినే ముందు తొలగించండి. దీని వల్ల సులభంగా జీర్ణమవ్వటానికి సహాయపడుతుంది.అలాగే పిల్లలకు పసుపు పొడి 6 నెలల తర్వాత శ ఇవ్వొచ్చు. పసుపు పొడిని దాల్ కా పానీ, ఖిచ్డి, సూప్, డ్రై ఫ్రూట్స్ పౌడర్లో చేర్చవచ్చు. ఎంత కలపొచ్చంటే..అది డిష్ మీద ఆధారపడి ఉంటుంది , ఖిచ్డిలో 1/4 టీస్పూన్ పసుపు కలపవచ్చు.




పసుపు వల్ల పిల్లలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సహజ క్రిమినాశక మందు, పిల్లలలో దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్.అలాగే జీరాను 6 నెలల తర్వాత శిశువులకు ఇవ్వొచ్చు. జీరాను ప్యూరీస్, ఖిచ్డి, రుచికరమైన సూప్ లలో చేర్చవచ్చు. ఎంత పరిమాణంలో అంటే చిటికెడు నుండి 1/4 టీస్పూన్ జీరా పౌడర్ వరకు ఉండే డిష్ పరిమాణాన్ని బట్టి శిశువు ఆహారంలో చేర్చవచ్చు. శిశువులకు జీలకర్ర  సమర్థవంతమైన యాంటీ ఫంగల్,  యాంటీ మైక్రోబయల్ ఏజెంట్. పిల్లలకు విరేచనాలు,  గ్యాస్ సమస్యలకు వ్యతిరేకంగా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: