ప్రస్తుత సమాజంతో పోల్చుకుంటే మనం గడిపిన బాల్యం ఎంతో అద్భుతంగా ఉండేది.. తలచుకున్న ప్రతిసారి బాల్యం మళ్ళీ తిరిగి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది.. అందంగా ఉంటుంది అని అనుకోని వారు బహుశా ఎక్కడ ఉండరేమో.. ఇంట్లో కుటుంబ సభ్యులతో గారాబం.. బడికి వెళ్లి చక్కగా పాఠాలు విని, పంతులు చెప్పిన విషయాలు ఎన్నో నేర్చుకోవడం.. సాయంత్రం రాగానే చెట్లు, గుట్టలు ,పొలాలు.. స్నేహితులతో ఇష్టమైన ఆటలు ఆడడం, పసందైన వంటలు.. తప్పు చేస్తే అమ్మ కొట్టేది.. కానీ ప్రతి విషయంలో కూడా ఒక పరమార్థం ఉండేది.. మన బాల్యం అంతా ఎంతో సంతోషంగా సాగిపోయింది.. ఎటువంటి ఈర్ష, అసూయ లేకుండా చాలా చక్కగా గడిచిపోయిన రోజులు ఉన్నాయి.. కానీ నేటి తరం బాల్యానికి అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అని చెప్పవచ్చు..ఎందుకంటే ఈ కాలం చిన్నపిల్లలు చిన్నప్పటినుంచే స్వేచ్ఛను కోరుకుంటున్నారు.. ఇందుకు కారణం.. టెక్నాలజీ వల్ల సమాజం మారుతుందని సంతోషపడాలో.. లేక ఇదే టెక్నాలజీ వల్ల చిన్న పిల్లలు తప్పుదోవ పడుతున్నారని బాధపడాలో తెలియడం లేదు.. చిన్నపిల్లల దైవంతో సమానం.. వీరు ఏదైనా నేర్చుకోవడానికి, సాధించడానికి పునాదులు ఇక్కడే పడతాయి కాబట్టి ఈ బాల్యం ఎంతో అమూల్యమైనది.. ఇక చాలా మంది చిన్న పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా, ఇష్టానుసారంగా తమకు నచ్చినది చేయడానికి ఇష్టపడుతున్నారు.. ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే తప్పకుండా పెద్దలు దండిస్తారు..అంతమాత్రాన ఆత్మహత్య చేసుకోవడం సబబు కాదు.ఇప్పటికి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడో ఒకచోట బాల్యంలో ఉన్న చిన్న పిల్లలు ఎక్కువగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని వార్తలు వింటూనే ఉన్నాం.. జీవితం చాలా చిన్నది , ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు ప్రాణాల్ని పోగొట్టుకుంటే భవిష్యత్తులో సాధించాల్సింది చాలా ఉంది.. కాబట్టి బాల్యమా ఇకనైనా మేలుకో.. ఎవరో అన్న మాటలు పట్టించుకోకుండా క్రమశిక్షణతో నీ జీవితానికి బంగారు బాటలు వేసుకో.. అప్పుడే జీవితంలో నువ్వు అనుకున్నది.. కావాలనుకున్నది సాధించగలవు.. భావితరాల వారికి ఆదర్శంగా నిలువు.. అఖిలభారత బాల్యానికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి: