ఈ పొడి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే..?

ఇక ఎండు ఖర్జూరాలు  చాలా రుచిగా ఉంటాయి.మధుమేహం వ్యాధి గ్రస్తులు ఈ ఎండు ఖర్జూరాలను ఒకటి లేదా రెండు కంటే ఎక్కువగా తీసుకోకూడదు. పంచదారకు బదులుగా ఈ ఎండు ఖర్జూరాలను పొడిగా చేసి వాడడం వల్ల మనం చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఎండు ఖర్జూరాలతో పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండు ఖర్జూరలను తీసుకొని వాటిని ముక్కలుగా చేసి నాలుగు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడి అయ్యే దాకా బాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి.ఇలా రెడీ చేసుకున్న ఎండు ఖర్జూర పొడిని తీపి పదార్థాల తయారీలో పంచదారకు బదులుగా మనం ఉపయోగించుకోవచ్చు. 


ఈ విధంగా ఖర్జూర పొడితో చేసిన పదార్థాలను తినడం వల్ల దంతాలు పుచ్చిపోవడం, గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్, చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఇంకా అలాగే దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఖర్జూర పొడి వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ ఖర్జూర పొడితో చేసిన తీపి పదార్థాలను ఆస్థమా వ్యాధి గ్రస్తులు కూడా హ్యాపీగా తినవచ్చు. ఎండు ఖర్జూరాల పొడి వల్ల రక్తహీనత సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే శరీరానికి తగినంత శక్తి కూడా లభిస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనిని వాడడం వల్ల మరిన్ని  ప్రయోజనాలను ఈజీగా పొందవచ్చు. ఈ పొడిని పంచదారకు బదులుగా పిల్లలకు పాలల్లో కలిపి కూడా ఇవ్వవచ్చు. దీని వల్ల వారిలో పెరుగుదల కూడా చాలా చక్కగా ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ పొడిని తీసుకోండి ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు రాకుండా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: