సాధారణంగా అమ్మ అవడం అనేది దేవుడి అదృష్టమని చెబుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆడవారికి ఎక్కువగా పిల్లలు కలిగే అవకాశం కూడా ఉండడం లేదు. ఇలాంటి వారు ఐ యూ వీ, ఐ వీ ఎఫ్ పద్ధతుల ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఇకపోతే సాధారణంగా పిల్లల్ని కనే అవకాశం ఉన్నవారు కూడా ఈ మధ్యకాలంలో ఉద్యోగాల పేరిట పోస్ట్ పోన్ చేస్తూ వాటిని కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు. వీరంతా కూడా తల్లిదండ్రులు కావడానికి ఏ రకంగా ప్లాన్ చేసుకున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. లేకపోతే పిల్లలు కలిగే ఆస్కారం కూడా లేదు అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

ముఖ్యంగా ఐవిఎఫ్ పద్ధతిలో చికిత్స పొందుతున్నప్పుడు మాత్రం కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలట బ్లూటెన్ లేని ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది శాఖాహారం తీసుకోవాలి.. బిడ్డకు ప్లాన్ చేసుకున్న వారు ఎవరైనా సరే తప్పకుండా గర్భం ధరించే వరకు కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది అని వైద్యులు స్పష్టం చేశారు.. ఎందుకంటే ఆ ఆహారాలు మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తాయట.  వీర్యకణాల చలన శిలత ను తగ్గిస్తాయని దీనివల్ల ఆ స్పెర్మ్ అండాన్ని చేరడంలో వేగం తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కాబట్టి మీరు తినే ఆహారంలో కొన్నింటిని పక్కన పెట్టడం వల్ల గర్భధారణ త్వరగా పొందే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి వీటిలో ఒక రకమైన రసాయన పదార్థాలు కలుపుతూ ఉంటారు.కాబట్టి వీటిని తినడం వల్ల క్వాంటిటీ తగ్గిపోతుంది ప్రాసెస్ చేసిన మాంసాహారం కూడా తినకూడదు.  వీటిలో హార్మోన్ అవశేషాలు మిగిలే ఉంటాయి.  కాబట్టి ఇవి గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తాయి. ఆల్కహాల్ తీసుకోకూడదు. కాఫీ తాగే అలవాటు ఉన్నవారు కూడా మానేయడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: