ప్రస్తుతం మనసుని హత్తుకొనే ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చైనీస్ సామజిక మాధ్యమాలలో అప్లోడ్ అయిన ఈ వీడియో కొద్ది సమయంలోనే వైరల్ అయ్యి... కోటికి పైచిలుకు వ్యూస్ ని సంపాదించింది. వివరాల్లోకి వెళితే... ఒక చైనీస్ గర్భవతి కన్సల్టేషన్ రూం ఎదుట ఎక్కువ సేపు నిల్చొని... డాక్టర్ పిలిపు కోసం వేచి చూసి బాగా అలసి పోయింది. అయితే ఆస్పత్రికి వచ్చిన ఇతర రోగులు ఈ గర్భవతి అలసిపోయి బాధపడుతున్న కూర్చోడానికి ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అంతే చూస్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకున్న ఆమె భర్త ఆస్పత్రి ఫ్లోర్ పైన కూర్చుని... తన భార్యను అతని భుజాల మీద కూర్చోమని చెప్పాడు.


దాంతో అప్పటివరకు తన కాళ్ళ మీద నిల్చొని బాగా అలసి పోయిన భార్య... భర్త మీద కూర్చొని కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంది. కాసేపటి తర్వాత... భార్యకు దాహం వేస్తోందోనని ఆ స్వీట్ హస్బెండ్ త్రాగునీరు తెచ్చుకోమని భార్యని పంపించినట్లు ఈ వీడియోలో కనపడుతుంది.

ఈ వీడియో చైనీస్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ... గర్భవతి అయిన మహిళకు సీట్ ఇవ్వని అక్కడ వారిని తిట్టిపోశారు. అంతే... భార్య ఇబ్బంది పడుతుంటే చూడలేని భర్త... ఒక కుర్చీ లాగా మారడంతో అతన్ని బాగా కొనియాడారు.


ఈ వీడియో క్లిప్ ను చూసిన నెటిజన్లు మాత్రం... భార్యపై చూపించిన భర్త ప్రేమకు ఫిదా అయిపోయారు. అక్కడున్న వారు ఈ జంటని వీడియో తీయడానికి ఇష్ట పడ్డారు కానీ సీటు ఇవ్వడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదని నెటిజన్లు వాళ్లని తిడుతున్నారు. కనీసం గర్భవతి అయిన మహిళకు కూడా సీటు ఇవ్వాలేని సమాజంలో మనం బ్రతుకుతున్నామా అని కామెంట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

https://mobile.twitter.com/CarlZha/status/1203270899572428800

మరింత సమాచారం తెలుసుకోండి: