ఆలుమగల మధ్య అవగాహన, పరస్పర ప్రేమానురాగాలు లోపించడం వల్లనే ఈనాడు కుటుంబాల్లో శాంతి కరువైపోతోంది. కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే, అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరి పరిధుల్లో వారు తమతమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని అతిక్రమించకూడదు. అలాగే పురుషులు భార్యలపై పెత్తనం చలాయించకూడదు. సహధర్మచారిణితో సత్ప్రవర్తనతో కూడిన జీవితం గడపాలి. ఆమె హక్కులను విశాల హృదయంతో గౌరవించాలి. ఎందుకంటే, ‘వారితో సత్ప్రవర్తనతో సంసారం చేయండి’ (నిసా) అని దైవం ప్రబోధించాడు.

 

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగస్తులే. ఆర్ధిక ఇబ్బందులు లేవు. అయినా పడకింట్లోకి పోగానే పేచీ వస్తోంది. సంసార సుఖాన్ని ఎంజాయ్ చేద్దామనుకుంటే వీలు కుదరడం లేదు. ఇటువంటి సమస్యలకు తప్పు మీలో లేదు. మీపైన గ్రహాల అనుకూలత లేనందువల్ల ఈ కష్టాలు పడుతున్నారు. శృంగారానికి, గ్రహాలకు ఏంటి లింకు అని మీరు ప్రశ్నించవచ్చు!!.. వాటి మధ్య సంబంధం ఉంది.

 

పెళ్లి చేసుకునే ముందు ఇద్దరి జాతకాలు, గ్రహాల లోపాలను తొలిగించడానికి ఎలా శాంతి పూజలు నిర్వహిస్తారో.. ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు శృంగారాన్ని ఆనందించడానికి కూడా గ్రహాల శాంతి ఎంతైనా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: