భారతీయులు ఐక్యత లేని వాళ్ళు..భారతీయులకి అసలు డిసిప్లెన్ అంటే తెలుసా..దాని అర్థం తెలుసా అంటూ నవ్వుకున్న ఆ నోళ్ళు ఇప్పుడు మూసుకున్నాయి...కాదు కాదు నోరు మూసుకునేలా సమాధానం చెప్పారు 130 కోట్ల మంది భారతీయులు. ఒక్కడు చెప్తే చేస్తారా మనమూ చూద్దాం అంటూ గుడ్లు మిటకరించి చూసిన ఎన్నో కళ్ళు బైర్లు కమ్ముకుని పోయాయి. భారత ఐక్యతని చూసిన అన్ని దేశాలు సహబాష్ అంటూనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఒక వ్యక్తిని నమ్మితే ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారని మరొక్క మారు భారతీయులు అందరూ ఋజువు చేసి చూపారు..

IHG

మోడీ చెప్పినట్టుగా 9 గంటలు అయ్యే సరికి ఒక్క సారిగా విద్యుత్ కాంతులు ఆగిపోయాయి. అంధకారంలో ఉన్నామా అన్నట్టుగా అనిపించినా ఒక్క నిమిషంలోగా కోట్లాది దీపాలు తమ వెలుగుని  ప్రసరించుతూ ప్రతీ ఒక్కరిలో ఆత్మస్తైర్యాని నింపాయి, ప్రకృతిని పరవశింప చేశాయి. ఇంతకంటే ఏమి కావాలి భారతీయులు అందరూ ఐక్యంగా ఉన్నారని చెప్పడానికి..మోడీ గెలవలేదు..కోట్లాది మంది భారతీయులని ప్రపంచం ముందు గెలిపించాడు. కరోనా కోరలు చాచి అందరూ అంధకారంలో నిండిపోయిన సమయంలో అందరిలో వెలుగులనే ధైర్యాన్ని నింపాడు.

IHG

9 గంటలకి 9 దీపాలు వెలిగించే పనులు ప్రజలేవరూ ఇలాంటివి చేయద్దంటూ వాగిన పడక కుర్చీ మేధావులు అందరికి మోడీ బదులు బుద్ది చెప్పారు ప్రతీ ఒక్క భారతీయుడు. మోడీ ఈ రోజు ప్రతీ ఒక్కరిలో నింపిన ధైర్యం...మనో బలం కరోనా లాంటి మహామ్మారులు ఎన్ని వచ్చినా ఎదుర్కునేలా చేసిందని, భవిష్యత్తులో కూడా చేస్తుందని  చెప్పడంలో సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: