భార్యభర్తల బంధం ఏడేడు జన్మలదంటారు. ఇది ఎంత నిజ‌మో ప‌క్క‌న పెడితే.. భార్యభర్తల బంధం కలకాలం సంతోషంగా ఉండాలంటే జంటగా ఏదైనా రెస్టారెంట్లో కలిసి భోజనం చేయడం, ఒకరికొకరు ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకుని ఆశ్చర్యపరచడం ఇలాంటివి కావు.. ఒక‌రిపై ఒక‌రికి బ‌ల‌మైన ప్రేమ ఉండాలి.. దృఢ‌మైన న‌మ్మ‌కం క‌ల‌గాలి. అయితే నేటి ఆధునిక యుగంలో భార్యాభర్తల సంబంధాలు కూడా యాంత్రికంగా మారిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి అపార్థాలు, అలకలు, కోపాలు పెరిగి దాంపత్యంలో ప్రేమభావన, ఆత్మీయత తగ్గపోతున్నాయి. అందుకే భార్యాభర్తలు మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు మానసిక శాస్త్రవేత్తలు అనేక మార్గాలు సూచిస్తున్నారు. 

 

అయితే మ‌రి భ‌ర్త నుంచి భార్య‌లు ఆశించే విష‌యాలు ఏంటి..? వారు అస‌లు ఏం కోరుకుంటారు..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా పెళ్లయిన కొత్తలో తమపై చూపిన ప్రేమను ఇప్పుడు చూపడం లేదని చాలామంది భార్యలు చెబుతుంటారు. వాస్త‌వానికి మగవారు ప్రేమ అనేది కొన్ని సందర్భాల్లోనే చూపుతారు.. అర్థం చేసుకుంటారు. కానీ, మహిళలు అలా కాదు.. ప్రతీ విషయంలోనూ ప్రేమగా ఉండాలనుకుంటారు. ఏ పని చేసినా అందులో ప్రేమ ఉండాలని కోరుకుంటారు. అందుకే వారితో ప్ర‌తిరోజు ప్రేమ కాసేపు కూర్చుని ముచ్చ‌ట్లు చెబితే మురిసిపోతార‌ట‌.

 

భార్యలను గౌరవించడం కూడా చాలా ముఖ్యమైన పని. కొంతమంది భర్తలు నలుగురిలోనూ తమ భార్యలను చులకనగా చూస్తారు. కానీ, అదే వారి పాలిట శాపంగా మారుతుంది. ఇలాంటి మగవారినే భార్యలు అస్స‌లు ఇష్టపడతారు. తమని పది మందిలో గౌరవంగా చూడాలని వారు కోరుకుంటారు. అందుకే ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇక మ‌రో విష‌యం ఏంటంటే.. మీరు చేసే ఏ విష‌యం అయినా భార్య‌కు చెబితే బాగానే ఉంటుంది. కానీ, ఆ విష‌యం వేరే వారి ద్వారా భార్య‌ల‌కు తెలిసిందంటే.. అప్పుడు ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. ఎందుకంటే సతులు.. తమ పతులు ఏ విషయంలోనూ దాపరికాన్ని ప్రదర్శించొద్దు అని కోరుకుంటారు. ఏ విషయంలోనైనా భర్తలు తమ దగ్గర అన్ని చెప్పాలని, ఓపెన్‌గా ఉండాలని కోరుకుంటారు. సో.. ఈ విష‌యంలోనూ భ‌ర్త‌లు భార్య‌ల ద‌గ్గ‌ర జాగ్ర‌త్త వ‌హించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: