నాలుగు గోడల మధ్య ఒంటరిగా కూర్చొని పనిచేయడం కంటే నలుగురు స్నేహితుల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో పనిచేయడం ఎంతో బెటర్ అని అనుకున్నారు. కానీ ఏం చేస్తాం కరోనా వైరస్ తగ్గకపోవడంతో వద్దు వద్దు అనుకున్న వర్క్ ఫ్రొం హోమ్ చేయాల్సి వస్తుంది. అయితే దాదాపు ఏడాదికి పైగా ఎంతో మంది ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్ లో కొనసాగుతున్న తరుణంలో ఎంతో మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నడుము నొప్పి మెడ నొప్పి లాంటివి ఎంతో మందిని వేధిస్తున్నాయి అయితే ఇక ఆఫీస్ లో చేసిన సమయం కంటే ఎక్కువ సమయంపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ లో పని చేయాల్సి వస్తుంది.
ఇలాంటి నేపథ్యంలో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా ఎంతోమందిని వర్క్ ఫ్రం హోం లో నడుము నొప్పి ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇంటి నుంచే పని చేసేటప్పుడు కుర్చీలో వెనక్కి అనుకొని కూర్చోవడం వల్ల వెన్నుముక పై ఎక్కువగా ప్రెజర్ పడే అవకాశం ఉండదు అని చెబుతున్నారు అంతేకాకుండా అలా కూర్చున్నప్పుడు పాదాలను పూర్తిగా నేలపై ఆనించడం ఎంతో మంచిదని చెబుతున్నారు. అంతేకాదు ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం కూడా ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు. ప్రతి 40 నిమిషాలకు ఒకసారి లేచి అటూ ఇటూ నడవడం చిన్నచిన్న స్ట్రెచెస్ లాంటివి చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి