అయితే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న జనాలు వైరస్ బారిన పడిన తర్వాత కూడా ఎక్కడ మనోధైర్యం కోల్పోకుండా మహమ్మారి వైరస్ తో పోరాడుతూ ఏకంగా ప్రాణాలు దక్కించుకున్నారు. ఇలా ఎంతోమంది వైరస్ బారిన పడినప్పటికీ చికిత్స తీసుకుని ధైర్యంగా కోలుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉండడం కూడా ఎంతో మందిలో మరింత ధైర్యాన్ని నింపుతున్నాయి . కానీ కొంతమంది కరోనా వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత అయోమయ స్థితిలో పడిపోతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే దానిపై ఎన్నో అపోహలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా శారీరక మానసిక ఒత్తిడి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇలా కరోనా నుంచి కోలుకున్న రోగులలో ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు వైరస్ నుంచి కోలుకున్న తరువాత దాదాపు రెండు నెలలపాటు ఈ సమస్య అందరినీ వేధిస్తున్నట్లు ఇటీవల వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం హెయిర్ లాస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాయామం చేయడం సరైన ఆహారం తీసుకోవడం లాంటివి చెయ్యడం వల్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు ఆహారంలో కూరగాయలు బచ్చలికూర ఆకుకూరలతో పాటు నారింజ లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం ఎంతో మేలు అంటూ సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి